Share News

పేరాబత్తులకే.. పట్టాభిషేకం!

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:21 AM

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో తొలిసారిగా తెలుగు దేశం పతాక రెపరెపలాడింది. ఆ పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ ఆధిక్యతతో గెలుపొందారు. సుమారు 30 గంటలకుపైగా సాగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారం భమై మంగళవారం మధ్యాహ్నం నాటికి ముగిసింది.

పేరాబత్తులకే.. పట్టాభిషేకం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీదే

పేరాబత్తుల రాజశేఖరానికి 70,421 ఓట్ల ఆధిక్యత

వీరరాఘవులుకు నిరాశ

30 గంటలపాటు లెక్కింపు

(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో తొలిసారిగా తెలుగు దేశం పతాక రెపరెపలాడింది. ఆ పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ ఆధిక్యతతో గెలుపొందారు. సుమారు 30 గంటలకుపైగా సాగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారం భమై మంగళవారం మధ్యాహ్నం నాటికి ముగిసింది. ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌ నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఆధిక్యతతో దూసుకుపోయారు. ఎక్కడా వెనుతిరిగి చూడ లేదు. రౌండ్‌ రౌండ్‌కి 15 వేలకు తగ్గకుండా ఓట్లు సాధించడం, తన సమీప పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుపై ఆధిక్యత ప్రద ర్శిస్తూ వచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభ ద్రులు తెలుగుదేశం వైపు మొగ్గారు. రాజశేఖరానికి భారీ మెజార్టీ అం దించారు. ప్రాధాన్యత క్రమంలో టీడీపీ అభ్యర్థి అలవోకగా విజ యం సాధించారు. చెల్లిన లక్షా 99 వేల 208 ఓట్లలో రాజశేఖరా నికి లక్షా 24 వేల 702 ఓట్లు లభించాయి. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో 62.5 శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థికే దక్కినట్ట య్యింది. టీడీపీ అభ్యర్థి రాజశేఖరానికి 77 వేల 421 ఓట్ల ఆధిక్యత లభించింది. మొత్తం ఎనిమిది రౌండ్లలో ఏ ఒక్క రౌండ్‌లోను మిగి లిన అభ్యర్థులు రాజశేఖరంను దాటలేకపోయారు. దీనికి తోడు పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పక్షాన గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా పేరాబత్తుల. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కూటమి శ్రేణులు అన్నిచోట్లా ఏకమయ్యాయి. ఆఖరుకి ఓట్ల నమోదు దగ్గర నుంచి ఓటర్ల జాబితా విడుదల వరకు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నేతలే దగ్గరుండి పరిశీలించుకున్నారు. తప్పొ ప్పులను బేరీజు వేశారు. పోలింగ్‌ సమయంలోను తీసుకున్న జాగ్రత్తలు పేరాబత్తులకు కలిసొచ్చాయి. ఈ కారణంగానే ప్రతి రౌండ్‌లోను తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కౌంటింగ్‌ ఆరంభం నుంచి ఏదొక రౌండ్‌లో తమది పైచేయి కాకపోతుందా అని ఎదురుచూసిన పీడీఎఫ్‌ అభ్యర్థి వీర రాఘవులుకు నిరాశ తప్పలేదు. కాగా, వీర రాఘవులు ఓటమితో గడిచిన రెండు దఫాలుగా విజయం సాధించి ఈసారి హ్యాట్రిక్‌ సాధిద్దామనుకున్న పీడీఎఫ్‌ ఆశలు నెరవేరకుండాపోయాయి.

సుందర్‌కు మూడో స్థానం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థుల్లో టీడీపీ అభ్యర్ధి పేరా బత్తుల రాజశేఖరం మొదటి, పీడీఎఫ్‌ అభ్యర్థి వీరరాఘవులు దక్కిన ఓట్లలో రెండో స్థానం సాధించగా మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయుడు జి.వి.సుందర్‌ మూడో స్థానం దక్కించుకున్నారు.ఆ యనకు 16,183 ఓట్లు దక్కాయి. మొద టి రౌండ్‌ నుంచి వెయ్యి ఓట్లు దాటే కొన సాగగలిగారు. మొదటి రౌండ్‌లో 1968, రెండో రౌండ్‌లో 2,238, మూడవ రౌండ్‌లో 2,119, నాల్గవ రౌండ్‌లో 2, 484, ఐదవ రౌండ్‌లో 2,208, ఆరవ రౌండ్‌లో 1,741, ఏడవ రౌండ్‌లో 2,106, ఎనిమిదవ రౌండ్‌లో 1,319 ఓట్లు దక్కా యి. 35 మంది అభ్యర్థులు ఉండగా మూడో స్థానం దక్కించుకోగలిగారు.

35 మందికీ.. ఓటు పడింది!

వ.స. అభ్యర్థి ఓట్లు

1. పేరాబత్తుల రాజశేఖరం(టీడీపీ) 1,24,702

2. కాట్రు నాగబాబు 565

3. షేక్‌ హుస్సేన్‌ 394

4. కట్టా వేణుగోపాలకృష్ణ 1017

5. కాండ్రేగుల నరసింహం 364

6. కాళ్ళూరి కృష్ణమోహన్‌ 190

7. కుక్కుల గోవిందరాజు 269

8. కునుకు హేమకుమారి 956

9. కైలా లావణ్య 365

10. గౌతమ్‌బాబు కొల్లు 317

11. చిక్కాల దుర్గారావు 665

12. తాళ్ళూరి రమేష్‌ 201

13. దత్తాత్రేయ నోరి 567

14. దిడ్ల వీరరాఘవులు(పీడీఎఫ్‌) 47,241

15. దొరబాబు యాళ్ళ 303

16. నీతిపూడి సత్యనారాయణ 161

17. తినిపి నాగభూషణవర్మ 68

18. పిప్పళ్ళ సుప్రజ 479

19. పేపకాయల రాజేంద్ర 199

20. బొడ్డు శ్రీనివాసరావు 152

21. బొమ్మనబోయిన వి.ఎస్‌.ఆర్‌.మూర్తి 119

22. బొమ్మిడి సన్నీరాజ్‌ 398

23. బండారు రామ్మోహన్‌రావు 709

24. భీమేశ్వరరావు చిక్కా 254

25. మాకి దేవీప్రసాద్‌ 146

26. మెర్ల శాస్త్రులు 103

27. మోకన అంబేద్కర్‌ 129

28. రాజపూడి 95

29. జి.టి.రామారావు 39

30. రేవులగడ్డ ముఖేష్‌బాబు 96

31. వానపల్లి శివగణేష్‌ 772

32. శ్రీనివాస్‌ విష్ణువరుల 190

33. ఎం.శ్రీనివాసరావు 41

34. జి.వి.సుందర్‌ 16,183

35. హసన్‌ షరీఫ్‌ 759

గ్రాడ్యుయేట్లు.. జై కొట్టారు!

ఉమ్మడి జిల్లాలోనూ ఏకపక్షంగా ఓటింగ్‌

(కాకినాడ/రాజమహేంద్రవరం/అమలాపురం -ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఓటర్లు కూటమికి పట్టం కట్టారు. కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూ టమికి ఇచ్చిన ఏకపక్ష విజయం తరహాలోనే గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లోను జైకొట్టారు. మొత్తం ఓటు హక్కు వినియోగిం చుకున్న గ్రాడ్యుయేట్లలో 85శాతానికిపైగా కూటమి అభ్య ర్థివైపే మొగ్గు చూపారు. దీంతో వైసీపీకి షాక్‌ తగిలింది. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి అభ్యర్థిని నిలబెడితే మళ్లీ పరాభవం ఎదురవుతుందనే భయంతో ఆ పార్టీ వెనక్కు తగ్గింది. అదే సమయంలో టీడీ పీ అభ్యర్థికి ప్రధాన పోటీ ఇచ్చిన మరో అభ్యర్థికి తెరవెనుక సహకారం అందించింది. కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు చేసింది. ఎక్కడికక్కడ సోషల్‌ మీడియా గ్రూపుల్లోను కూటమిపై బురదజల్లే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా గ్రాడ్యుయేట్‌ ఓటర్లు వీటిని వినిపించుకోలేదు. కూటమి అభ్యర్థికి ఏకపక్షంగా ఓటేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 62,970 మంది ఓటర్లు ఉన్నారు. పురు షులు 36,361 మంది, మహిళలు 26,606 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. పోలింగ్‌ రోజున 42,446 మంది 67.4 శాతం ఓటేశారు. కోనసీమ జిల్లాలో 64,471 మంది ఓటర్లు ఉన్నారు. 47,125 మంది 73.09 శాతం ఓటేశారు. పురుషులు 27,450 మంది, మహిళలు 19,850 మంది, ఇతరులు ఒకరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాకినాడ జిల్లాలో 70,540 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు నమో దవగా ఇందులో 42,463 మంది పురుషులు, 28,072 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో పోలింగ్‌ రోజు 47,150 మంది తమ ఓటు హక్కు విని యోగించుకున్నారు. వీరిలో 29,232 మంది పురుష ఓట ర్లు, 17,918 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మెజార్టీ ఓట్లు కూటమి అభ్యర్థి పేరాబత్తులవైపే పడ్డాయి. మహిళా ఓటర్లయితే కూటమికి ఓట్లతో పట్టాభిషేకం చేశారు. కౌంటింగ్‌లో ప్రతి రౌండ్‌లోను కూటమి అభ్యర్థి పేరా బత్తుల అనుహ్య మెజార్టీతో ముందుకు సాగారు. విజయానికి కావలసిన ఓట్లను తొలి ప్రాధాన్యత ఓట్లతోనే సొంతం చేసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కూటమి అభ్యర్థికి జిల్లా ఏకపక్షంగా అండగా నిలిచింది.

ఆది నుంచి ఒక్కటే లక్ష్యం

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తులను ప్రకటించిన టీడీపీ అడుగుడుగునా పక్కా ప్రణాళికతో విజయం కోసం ముందుకు సాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఎప్పటికప్పుడు నేతలను అప్రమత్తం చేశారు. ఎన్నిక జరిగినన్ని రోజులు ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు ప్రత్యేక బాధ్యత అప్పగించి ఎమ్మెల్యేలందరిని సమన్వయం చేసే బాధ్యత అప్పగించారు. దీంతో నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ విజయం తమ విజయంగా భావించి క్యాడర్‌తో సమీక్షలు, ఎన్నికల ప్రచారం వరకు అంతా తామే అయి నడిపించారు.ఇలా ఎవరికివారు కూటమి అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా కష్టపడ్డారు. పేరాబత్తుల విజయంతో టీడీపీ నేతలు మంగళవారం జిల్లాలో పలు చోట్ల సంబరాలు జరిపారు. కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిన నేపథ్యంలో ఆనందోత్సవాల్లో మునిగితేలారు.

చంద్రబాబును నమ్మారు.. నన్ను గెలిపించారు

ఎమ్మెల్సీగా ఎన్నికైన పేరాబత్తుల రాజశేఖరం

కూటమి ప్రభుత్వం 8 నెలల్లో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులు నమ్మారు.. అందుకే తనను మెజార్టీతో గెలిపించి మండలికి పంపే అవకాశం ఇచ్చారని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాఽధించిన పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. ఫలితం ప్రక టించిన వెంటనే మంగళవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. తనను నమ్మి గెలిపించిన పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటానని, అంద రికి అందుబాటులోకి ఉంటానన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు రాష్ర్టాన్ని బాగు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, తాను కూడా తనవంతు పాత్ర పోషిస్తానన్నారు. కుటుంబ సభ్యులతో పేరాబత్తుల విజయాన్ని పంచుకున్నారు. అభిమానులు బాణసంచా పేల్చి హర్షం వ్యక్తంచేశారు.

బయట నుంచి పోరాడతా..

పీడీఎఫ్‌ అభ్యర్థి వీరరాఘవులు

తనను గెలిపిస్తే పట్టభద్రుల సమ స్యలపై మండలిలో పోరాటం చేయాలని కోరారు. అయితే తనకు అవకాశం ఇవ్వ లేదని, అయినా బయట నుంచి నిరు ద్యోగుల సమస్యలపై ఇక పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు ఫలితం వెలువడిన తర్వాత మీడియాతో అన్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో చెల్లని ఓట్లు తేలడం, కొంత పట్టభద్రుల్లో తొట్రుపాటు, ఒత్తిడి, అవగాహనలేమి కారణం అయి ఉండ వచ్చు. రానున్నకాలంలో ఓటుపై మరింత అవగాహన కల్పిస్తానన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 01:21 AM