ఇక ఎమ్మెల్సీ పోరు
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:28 AM
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. దీంతో సమాంతరంగా ఎన్నికల ‘కోడ్’ కూసింది.

ఈ ఏడాది ఆరంభంలోనే ఎన్నికల సందడి మొదలైంది. చాలాకాలం నుంచి పట్టభద్రులు ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇప్పటికే కార్యరంగం సిద్ధం చేసుకుని వివిధ వర్గాలతో అనేకమంది అభ్యర్థులు ఓటర్లతో మమేకం అవుతూ వస్తున్నారు. 2019లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల గడువు ముగియనుండడంతో తిరిగి ఎన్నిక అనివార్యమైంది. ఈసారి టీడీపీ సహా పెద్ద సంఖ్యలోనే అభ్యర్థులు రంగంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు ఎన్నికల్లోను నువ్వానేనా అనేటట్టుగా అభ్యర్థులు ఢీకొనబోతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఈసారి రంగంలో టీడీపీ అభ్యర్థి
ఇప్పటికే ప్రచార పర్వంలోకి
వామపక్షాలతోపాటు బరిలోకి అత్యధికులు
హోరాహోరీ పోటీ తప్పదా..
(కాకినాడ సిటీ/రాజమహేంద్రవరం / ఏలూరు-ఆంధ్రజ్యోతి)
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. దీంతో సమాంతరంగా ఎన్నికల ‘కోడ్’ కూసింది. ఇప్పటికే కూటమి తర పున టీడీపీ సహా మిగతా పక్షాలు తమ అభ్య ర్థులను ఎన్నికల బరిలో నిలిపేందుకు సన్నా హాల్లో ఉన్నాయి. కూటమి టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను మూడు నెలల కింద టే రంగంలోకి దింపారు. ఓటర్ల నమోదు ప్రక్రి య ఆరంభం నుంచి రాజశేఖర్ తన పని తాను చేసుకుంటూపోతున్నారు. ఎట్టి పరిస్థితు ల్లోను ఎమ్మెల్సీల్లో ఎన్నికల్లో పార్టీ బలపరుస్తు న్న అభ్యర్థి గెలిచేలా చూడాలని ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం జిల్లాస్థాయి నాయకత్వాన్ని ఆదేశించింది. తాజాగా పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న రాజశేఖర్ గెలుపు పార్టీకి అత్యవసరమని, ఎక్కడా పొరపాట్లకు, లోటు పాట్లకు తావివ్వద్దని పార్టీ ముఖ్యుల భేటీలో సీఎం చంద్రబాబు సూచనలు జారీ చేశారు. బుధవారం రాజశేఖర్ అమరావతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్‌తో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలు, ఇతర నేతల మద్దతు ఆయనకు లభించింది. దీంతో పట్టభద్రుల ఓట ర్ల నమోదు ఆరంభ దశలోనే ఆయనను ఉభ యగోదావరి జిల్లాల్లో పర్యటించేలా పార్టీ ము ఖ్యులు చొరవ చూపారు. అన్ని నియోజకవర్గా ల్లోను పట్టభద్రుల ఓటర్ల చేరికలో చొరవ తీసు కోవాల్సిందిగా ఉభయగోదావరి జిల్లాల నేతలకు అప్పట్లోనే ఆదేశాలు అందాయి. దీంతో పార్టీ సీనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ రాజశేఖర్‌ను పార్టీ కేడర్‌కు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వివిధ నియోజకవర్గాల్లో ఓటర్లతో సాన్నిహిత్యం పెంచుకుంటూ వస్తున్నారు. ఇంకోవైపు గడిచిన 2019లో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా అప్పట్లో వామపక్షాలు బలప రిచిన అభ్యర్థి ఐ.వెంకటేశ్వరరావు గెలుపొందా రు. విద్యావేత్త శేషారెడ్డిపై వెంకటేశ్వరరావు విజ యం సాధించారు. ఆనాటి ఎన్నికల్లో వీరిద్దరి మధ్య హోరాహోరీగానే పోరు సాగింది. పట్టభ ద్రుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకర కాల ప్రయోగాలు చేశారు. వామపక్షాలు బలప రిచిన అభ్యర్థి కాకుండా తమకు మద్దతు ఇస్తే అనూహ్యంగా సరైన స్థితిగతులు కల్పిస్తామం టూ మిగతా వారంతా పెద్దఎత్తున ప్రచారం సాగించారు. అయినప్పటికీ పట్టభద్రుల ఓటర్లు వెంకటేశ్వరరావు వైపే మొగ్గు చూపారు. అప్ప ట్లో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగకుండా జాగ్రత్తపడింది. ఈసారి వామపక్షాల మద్దతు తో తూర్పుగోదావరికి చెందిన దిడ్ల వీరరాఘ వులు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తాము బలపరిచిన అభ్యర్థి గెలు పొందేలా, ఉమ్మడి నిర్ణయం అమలయ్యేలా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరి స్థితుల్లోను పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్ని కలు ఎప్పుడు జరిగినా అధికారంలో లేని పక్షాని కే ఓటర్ల మొగ్గు ఉంటుందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా తాము బలపరి చిన అభ్యర్థే గెలుపొందుతారన్న ధీమాతో ఉన్నా రు. దీనికితోడు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున అభ్యర్థులు పోటీకి దిగే అవ కాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గతం కంటే భిన్నంగా ఈసారి పట్టభద్రుల్లో చైతన్యం రావడం, ఓటర్ల జాబితాలో సంతృప్తికర స్థాయి లో ఓటర్ల నమోదు జరగడం మరో పరి ణామం. సాధ్యమైనంత మేర ఓటర్లను ఆకర్షించడం, గెలుపుకు చేరువకావడం అనే రెండు లక్ష్యాలను సాధించేందుకు తహతహలాడుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ నుంచి పోటీ ఉంటుందా లేదా ఎవరికైనా మద్దతుగా నిలుస్తుందా.. స్పష్టత లేదు.
పురుష ఓటర్లదే ఆధిక్యత
గడిచిన మూడు మాసాలుగా ఓటర్ల జాబితాలో చేరికలు భారీగానే సాగాయి. నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యే లు, కూటమి ముఖ్య నేతలు పట్టుపట్టి మరీ ఓటర్ల చేరికను ప్రోత్సహించారు. గడిచిన నెలన్నర కిందట ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్ల జాబితాలో కేవలం లక్షా 27 వేల మంది నమోద య్యారు. ఆ తదుపరి నియోజకవర్గాల వారీగా సమీక్ష సాగడంతో ఒక్కసారిగా ఈ సంఖ్య ఎక్కడికక్కడ పెరుగుతూ వచ్చింది. మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల 15 వేల 261గా ఉంది. వీరిలో పురు ష ఓటర్ల సంఖ్య లక్షా 83 వేల 734 కాగా, అదే మహిళా ఓటర్ల సంఖ్య వీరికంటే తక్కువగా లక్షా 31 వేల 507గా లెక్క తేలింది. అంటే పట్టభద్రుల నియోజక వర్గంలో పురుష ఓటర్లే గెలుపోటములకు నిర్ణేతలు కాబోతున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 42 వేల 602 మంది ఓటర్లు ఉండగా అదే పశ్చిమగోదావరిలో 69 వేల 884 మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో పట్టభద్రులకు చోటు కల్పించే దిశగా ఏపీ ఎన్జీవోలు ఒకింత చొరవ చూపారు.
నేటి నుంచి అమలులోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల
27న పోలింగ్.. మార్చి 3న కౌంటింగ్
కాకినాడ సిటీ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక నగరా మోగింది. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం షెడ్యూల్ విడుదలైంది. తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లా ల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు శ్రీకా కుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇం దులో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 10వతేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల వడపోత చేయనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ గడువుగా ప్రకటించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుం ది. ఈ ప్రక్రియ 8వ తేదీలోగా ముగించాల్సి ఉంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఇంతవరకు ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 3 లక్షల15 వేల 261మంది పట్టభద్రుల ఓటర్ల నమోదు జరి గింది. ఇదిలా ఉండగా, ఈనెల 31వ తేదీ వరకు పట్టభద్రుల ఓటర్ల నమోదుకు గడువు ఉంది.
నామినేటెడ్ పోస్టులన్నీ వాయిదా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో కూటమి ప్రభు త్వం నామినేటెడ్ పోస్టుల భర్తీతో సహా మార్కెట్ కమిటీల ఎన్నిక ప్రక్రియ వరకు అంతా గప్‌చుప్‌గా అయింది. సంక్రాంతి పండుగ తర్వాత పదవుల పం దేరం ఉంటుందని ఎంతో ఆశగా చూస్తున్న వారంద రికీ ఈ ఎన్నికల షెడ్యూలు ఆశనిపాతంలా మారిం ది. ఇక మార్చి వరకు ఎదురుచూపులు తప్పవు.