Share News

మంత్రులకు ర్యాంకులు

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:48 AM

మంత్రుల పనితీరుకే కాదు.. ఫైల్స్‌ క్లియరెన్స్‌కు ర్యాంకులు ఉంటాయి.. తాజాగా ఆ ర్యాంకులను కేటాయించారు. ఇటీవల సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులు తమ శాఖల పరిధిలో ఫైళ్లను ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.

మంత్రులకు ర్యాంకులు
పదో ర్యాంకు సాధించిన పవన్‌ కల్యాణ్‌

మంత్రుల పనితీరుకే కాదు.. ఫైల్స్‌ క్లియరెన్స్‌కు ర్యాంకులు ఉంటాయి.. తాజాగా ఆ ర్యాంకులను కేటాయించారు. ఇటీవల సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులు తమ శాఖల పరిధిలో ఫైళ్లను ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చించారు. అనంతరం ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరు ఎలా ఉందనేదానిపై సీఎం ర్యాంకులు ప్రకటించారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్‌ రెండో ర్యాంకులో నిలిచారు.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పదో ర్యాంకు.. బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసంశెట్టి సుభాష్‌ 25 ర్యాంకులో నిలిచారు. ఈ ర్యాంకులను కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్ర బాబునాయుడు స్వయంగా ప్రకటించడం గమనార్హం.

దుర్గేష్‌ అద్వితీయం!

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి) : పైళ్ల క్లియ రెన్స్‌లో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహి స్తున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు లభిం చింది.కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ మం త్రి ఎన్ని ఫైళ్లు క్లియర్‌ చేశారనే దానిపై సీఎం చంద్రబాబు ర్యాంక్‌లు ప్రకటించారు. అందులో మంత్రి కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు లభించింది.దీనిపై ఆయనను సంప్రదించగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏడు నెలల్లో సుమారు 120 ఫైళ్లు క్లియర్‌ చేసినట్టు చెప్పారు. తాను పర్యాటక, సాంస్కృతిక, సినిమాటో గ్రఫీశా ఖలకు సంబంధించిన ఫైళ్లను క్లియర్‌ చేశానని, అందులో టూరిజం శాఖకు చెందినవే అధికంగా ఉన్నాయన్నారు. మరింత ఉత్సా హంగా పనిచేయడానికి ఈ ర్యాంకు ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పారు.

పవన్‌కు.. పది

కాకినాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్‌,గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ,సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి కొణిదల పవన్‌కల్యాణ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌లో 10వ ర్యాంకులో నిలిచారు..పవన్‌ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. మంత్రుల ఫైళ్ల క్లియరెన్స్‌పై సీఎం ర్యాంకులు ప్రకటిం చారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ పదో ర్యాంకులో నిలిచారు. ఇకపై మరింత వేగవంతమైన పనితీరు అందించే క్రమంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. పవన్‌కల్యాణ్‌ అత్యంత కీలకమైన శాఖలు చూస్తున్నారు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫైళ్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని పరిష్కరిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తరచూ పర్యటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.ఈ నేపథ్యంలో ఫైళ్ల క్లియరెన్స్‌కు కాస్త ఆలస్యం అవుతున్నా వాటిని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు.

సుభా..ష్‌..!

అమలాపురం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి కార్మికశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాసంశెట్టి సుభాష్‌ ఫైళ్ల క్రియరెన్సులో చివరిస్థానం 25లో నిలిచారు.కోనసీమకు చెందిన మంత్రి సుభాష్‌ ఫైళ్ల పరిష్కారంలో చివరిస్థానంలో ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో ఒకసారి అధినేత చంద్రబాబునాయుడుతో మందలింపునకు గురైన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో ర్యాంకుల్లోనూ చివర నిలవడంతో మంత్రి సుభాష్‌ రాగల రోజుల్లో మరింత కష్టించి పనిచేయాల్సి ఉంటుందని ఆయన సన్నిహితులు సూచనలు చేస్తున్నారు. సుభాష్‌ పనితీరు పట్ల కొన్నివర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - Feb 07 , 2025 | 12:48 AM