క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:00 AM
రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 15 (ఆంధ్రజ్యోతి): క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం రాత్రి రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణం లో మంగళవారం రాత్రి బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బాస్కెట్‌బాల్ అ

మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురంలో బాస్కెట్‌బాల్ పోటీలు
రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 15 (ఆంధ్రజ్యోతి): క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం రాత్రి రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణం లో మంగళవారం రాత్రి బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఇన్ ఏపీ, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఇన్ కో నసీమ ఆధ్వర్యంలో నిర్వహించే 14వ ఆల్‌ఇండియా, 20వ ఏపీ బాస్కెట్‌బాల్ టోర్నమెంటును మంత్రి సుభాష్, ఎంపీ హరీష్‌మాధుర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ క్రీడాకారులకు విద్య, ఉద్యోగ నియామకాల్లో కోటా పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రామచంద్రపురంలో చాలా ఏళ్లుగా సంక్రాంతికి బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంపీ మాట్లాడుతూ ఖేల్ ఇండియా పథకంలో అమలాపురం పార్లమెంటులో స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఇన్ ఏపీ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాదంశెట్టి శ్రీధేవి మాట్లాడారు. క్రీడాకారులను మంత్రి, ఎంపీ పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, లయన్‌జి.విరావు, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కల రిష్వంత్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠగా పోటీలు
బాస్కెట్‌బాల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి, బుధవారం లీగ్ స్థాయి పోటీలు నిర్వహించారు. సీఆ ర్‌పీఎఫ్,చండీఘడ్, చత్తీస్‌ఘడ్, చెన్నైకు చెందిన మెన్ అండ్ ఉమెన్ జట్లు పాల్గొంటున్నాయి.