Share News

కేరళ అందాలు సొంతం చేసుకున్న కోనసీమ

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:56 AM

ఆత్రేయపురం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కేరళ అందాలను సొంతం చేసుకున్న కోనసీమ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. శనివారం ఆత్రేయపురం కాలువ రేవు వద్ద ప్రధాన కాలువలో 3రోజుల పాటు జరిగే సర్‌ ఆర్ధర్‌కాటన్‌ గోదావరి ట్రోఫి సంక్రాంతి సంబరాలు శనివా రం ప్రారంభించారు. తొలుతగా ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ జెండా ఊపి స్విమ్మింగ్‌ పోటీలు

కేరళ అందాలు సొంతం చేసుకున్న కోనసీమ
ఈత పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న మంత్రి దుర్గేష్‌

పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌

ఆత్రేయపురంలో సర్‌ ఆర్ధర్‌కాటన్‌ గోదావరి

ట్రోఫి సంక్రాంతి సంబరాలు ప్రారంభం

ఉత్కంఠ భరితంగా ఈత పోటీలు

ఆత్రేయపురం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కేరళ అందాలను సొంతం చేసుకున్న కోనసీమ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. శనివారం ఆత్రేయపురం కాలువ రేవు వద్ద ప్రధాన కాలువలో 3రోజుల పాటు జరిగే సర్‌ ఆర్ధర్‌కాటన్‌ గోదావరి ట్రోఫి సంక్రాంతి సంబరాలు శనివా రం ప్రారంభించారు. తొలుతగా ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ జెండా ఊపి స్విమ్మింగ్‌ పోటీలు ప్రారంభించగా జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ జ్యోతి ప్రజల్వన చేసి పోటీలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పా వురాలను ఎగురవేసి ట్రోఫి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్విమ్మింగ్‌ పోటీలు ఆస క్తిగా తిలకించారు. ఆత్రేయపురం రోడ్డు నుంచి అధిక సంఖ్యలో మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి దుర్గేష్‌ మాట్లాడు తూ సంక్రాంతి సంబరాల నిర్వహణకు ఎంతగానో కృషిచేసిన ఎమ్మెల్యే బండారుతో పాటు వి విధ శాఖల అధికారులను ప్రశంసించారు. గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తుందన్నారు. కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకులు ఆకర్షించేలా సీఎం చంద్రబా బు టెంపుల్‌ టూరిజం, ఈకో టూరిజం, అడ్వచర్‌ టూరిజం, స్పోర్ట్స్‌ టూరిజం తీసుకువచ్చినట్టు తెలిపారు. ఎక్కడిక్కడ రిసార్ట్స్‌ నిర్మించాల్సి ఉందన్నారు. కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ మా ట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలు నిర్వహించడం సంక్రాంతిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎంతగానో ఉల్లాసా న్ని అందించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం ఈ ట్రోఫిలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ లొల్ల లాకులు, పిచ్చికలంకలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రతి ఏటా ట్రోఫి పోటీలు నిర్వహిస్తామన్నారు. గోదావరి ట్రోఫి పోటీల్లో భాగంగా నిర్వహించిన ఈత పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. పోటీల్లో విజేతలకు మంత్రి దుర్గేష్‌, ఎమ్మెల్యే బండారు బహుమతులు ప్రదానం చేశారు. అమెరికా నుంచి సంక్రాంతి పండుగకు స్వదేశానికి వచ్చిన 70 ఏళ్లు పైబడిన వృద్ధురాలు స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొనడం విశేషం. సీఐ శివగణేష్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో మొదటిస్థానం సాధించారు. వివిధ విభాగాల్లో స్విమ్మింగ్‌, రంగవల్లులు, పతంగి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీకర్‌, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణరెడ్డి, చిలువూరి సతీష్‌రాజు, కరుటూరి నరసింహరావు, ముదునూరి వెంకట్రాజు, ముళ్ళపూడి భాస్కరరావు, ముత్యాల బాబ్జి, కంఠంశెట్టి శ్రీనివాస్‌, గుత్తుల రాంబాబు, జల్లి కామేశ్వరరావు, నరాలశెట్టి వెంకన్న, జుజ్జవరపు హరిబాబు, వివిధ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:56 AM