మత్స్యకారుల అభ్యున్నతికి కృషి
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:43 AM
తాళ్లరేవు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మత్స్య కారుల అభ్యున్నతికి కృషి చేస్తామని, ఆ వృత్తి చేస్తూ జీవనోపాధి కోల్పోయిన నష్టపోయిన రైతులకు 23,450 మందికి ఓఎన్‌జీసీ ద్వారా ఒ క్కొక్కరికి రూ.63,250 చొప్పున మొత్తం రూ.148 కోట్ల37లక్షల18,500 నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మా ర్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యకాశాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జి

మంత్రి అచ్చెన్నాయుడు
మత్స్యకారులకు నష్టపరిహారం అందజేత
తాళ్లరేవు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మత్స్య కారుల అభ్యున్నతికి కృషి చేస్తామని, ఆ వృత్తి చేస్తూ జీవనోపాధి కోల్పోయిన నష్టపోయిన రైతులకు 23,450 మందికి ఓఎన్‌జీసీ ద్వారా ఒ క్కొక్కరికి రూ.63,250 చొప్పున మొత్తం రూ.148 కోట్ల37లక్షల18,500 నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మా ర్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యకాశాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరి ంగ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో ఓఎన్‌జీసీ పైపులైను వల్ల నష్టపోయిన మత్స్యకారులకు నష్టపరిహారం ఓఎన్‌జీసీ సంస్థ నుంచి అందజేశారు. శుక్రవారం ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ సహకారంతో కూ టమి ప్రభుత్వం అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసేందుకు కృషి చేస్తుందన్నా రు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులు పాల్చేసిపోయిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని గాడిలోపెట్టేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నారన్నా రు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి 20,878 మందికి రూ.63,250 చొప్పున రూ.132కోట్ల 5లక్షల33వేలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురంలో 69మందికి సుమారుగా రూ.16 కోట్లు మొత్తం 23,458మందికి రూ.148కోట్ల 38లక్షలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలి పారు. ఎమ్మెల్యే దాట్ల మాట్లాడుతూ మత్స్యకారులకు సబ్సిడీ రుణాలు, వలలు, పనియుట్లు అం దించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ య నమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 1000 కిలోమీటర్లు వరకు కోస్టల్ ప్రాం తం ఉందని దీన్ని అబివృద్ధి చేయడానికి కూట మి ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్‌మాదుర్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరావు, అయితాబత్తుల ఆనం దరావు, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యో తుల నవీన్, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మత్స్యశాఖ కమిషనర్ టిడోలా శంఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.