Share News

680 మినీ గోకులాలు నిర్మిస్తాం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:54 AM

రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో రూ.1.85 లక్షలతో నిర్మించిన మినీ గోకులం షెడ్డును మంత్రి దుర్గేష్‌ కలెక్టర్‌ పి.ప్రశాంతితో కలిసి ప్రారంభించి మాట్లా డారు.

680 మినీ గోకులాలు నిర్మిస్తాం
నిడదవోలు మండలం విజ్జేశ్వరంలో మినీ గోకులం షెడ్డు ప్రారంభిస్తున్న మంత్రి దుర్గేష్‌, కలెక్టర్‌ ప్రశాంతి

రైతులకు 90శాతం సబ్సిడీ అందజేత

మంత్రి కందుల దుర్గేష్‌

నిడదవోలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో రూ.1.85 లక్షలతో నిర్మించిన మినీ గోకులం షెడ్డును మంత్రి దుర్గేష్‌ కలెక్టర్‌ పి.ప్రశాంతితో కలిసి ప్రారంభించి మాట్లా డారు. జిల్లాలో రూ.15.59 కోట్లతో 680 మినీ గోకులం నిర్మా ణాలు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 304 నిర్మాణాలు పూర్తి చేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తగా 12,500 గోకులాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం వేదికగా శుక్రవారం ప్రారంభించార న్నారు. పాడి రైతులకు ఎంతో అవసరమయ్యే గోకులాలను గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 268 నిర్మిస్తే కూటమి ప్రభుత్వం కేవలం ఆరు నెలల కాలంలోనే 12,500 నిర్మించిందన్నారు. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. పశు సంపదను రక్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ 90 శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు.కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో ఆర్‌డీవో రాణి సుస్మిత, డ్వామా పీడీ నాగ మల్లేశ్వర రావు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:54 AM