మాస కల్యాణాన
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:14 AM
ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో శ్రవణా నక్షత్ర మాస కల్యాణాన్ని బుధవారం ఘనంగా జరిపారు.
ఆత్రేయపురం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో శ్రవణా నక్షత్ర మాస కల్యాణాన్ని బుధవారం ఘనంగా జరిపారు. స్వామివారిని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను జరిపి స్వామివారి మాస కల్యాణాన్ని చేశారు. ఆలయ ఈవో బీహెచ్వీ రమణమూర్తి దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు అందించారు. అశేష భక్తజనం పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.