మహాకుంభమేళాలో గరగ బృందం ప్రదర్శన
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:37 AM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం ప్రదర్శన నిర్వహించారు.

అంబాజీపేట, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం ప్రదర్శన నిర్వహించారు. సౌత్ జోన్ కల్చర్ సెంటర్ పిలుపు మేరకు నాగబాబు సారఽథ్యంలో శ్రీ విజయదుర్గ సంగీత, నృత్యకళాక్షేత్రానికి చెం దిన 15 మంది కళాకారుల బృందం మహా కుంభమేళాలో పాల్గొని 6, 7, 8 తేదీల్లో గరగనృత్యాలు, శూలాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను దేశంలోని ప్రముఖులు పలువురు వీక్షించినట్టు నాగబాబు తెలిపారు. కాగా నాగబాబు కళాకారుల బృందం 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో, 2021లో వారణాశిలో జరిగిన గంగా ఉత్సవ్‌లో సౌత్ సెంట్రల్ జోన్స్ ద్వారా ప్రదర్శన అందించామని నాగబాబు తెలిపారు. అలాగే గతంలో నాగబాబు బృందం ఆధ్వ ర్యంలో ఢిల్లీలో జరిగిన పలు కార్యక్రమాల్లో కళాకారులు పలు ప్రదర్శనలు ఇచ్చారు.