పాదగయ క్షేత్రంలో జల్లు స్నానానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:47 AM
పిఠాపురం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పాదగయ క్షేత్రంలో నూతనంగా జల్లుస్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రితో పాటు ఇతర ముఖ్యమైన పర్వదినాల్లో పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. భక్తులు భారీగా తరలివచ్చిన సమ

పిఠాపురం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పాదగయ క్షేత్రంలో నూతనంగా జల్లుస్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రితో పాటు ఇతర ముఖ్యమైన పర్వదినాల్లో పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. భక్తులు భారీగా తరలివచ్చిన సమయంలో వృద్దులు, చిన్నారులు స్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు పడేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఓఎస్ డీ మధుసూదన్ సూచించారు. ఈ నేపథ్యంలో జల్లు స్నానం ఆచరించేందుకు వీలుగా షవర్లు ఏర్పాటు చేశారు. పాదగయ పుష్కరిణి చుట్టూ జల్లు స్నానం ఆచరించే వీలు కల్పిస్తున్నారు. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారని, వారి సౌకర్యా ర్థం వీటిని ఏర్పాటు చేశామని పాదగయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. పుష్కరిణిలో స్నానాలు ఆచరించలేని భక్తుల కోసం ఈ ఏర్పాటు చేశామని చెప్పారు.