మహాకుంభ మేళాకు ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:31 AM
మహాకుంభ మేళా యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు.

అమలాపురం రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మహాకుంభ మేళా యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు డిపో నుంచి బస్సులు బయలు దేరతాయని, ఎనిమిది రోజుల పాటు జరిగే యాత్రలో భాగంగా భువనేశ్వర్, పూరీ, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయా, బుద్దగయ, అరసవిల్లి, శ్రీకూర్మం, త్రివేణి సంగమ స్నానం, విశ్వనాథ దర్శనం జరుగుతాయన్నారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు కాశీ క్షేత్రాల్లో ఒకరోజు బస చేసే అవకాశం ఉంటుందని ప్రయాణికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందించనున్నట్లు చెప్పారు. టిక్కెట్ ఒక్కటి రూ.10,800 ధర నిర్ణయించినట్టు డిపో మేనేజర్ తెలిపారు. మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులు రిజర్వేషన్ సౌకర్యం కోసం అసిస్టెంట్ మేనేజర్ సెల్ 7013868687, 9959225576ను సంప్రదించాలన్నారు.