రుణాల మంజూరులో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలి : కలెక్టర్
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:32 AM
స్వమిత్ర పఽథకం కింద కచ్చితమైన భూరికార్డులను రూ పొందించడానికి, ఆస్తి సంబంధిత వివాదాలు, చట్టపరమైన కేసులను పరిరక్షించడానికి యజమానులు తమ ఆస్తిని ఆర్థికంగా ఉపయోగించుకొనేలా చేయడం కోసమే క్షేత్రస్థా యిలో సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.

రాజమహేంద్రవరం రూరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): స్వమిత్ర పఽథకం కింద కచ్చితమైన భూరికార్డులను రూ పొందించడానికి, ఆస్తి సంబంధిత వివాదాలు, చట్టపరమైన కేసులను పరిరక్షించడానికి యజమానులు తమ ఆస్తిని ఆర్థికంగా ఉపయోగించుకొనేలా చేయడం కోసమే క్షేత్రస్థా యిలో సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. స్వమిత్ర పఽథకం ప్రగతిపై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 50 రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రౌండ్ ట్రూ ఽథింగ్ పనులు జరుగుతున్నాయని, 75,388 ఎకరాలకుగాను 13,252 పూర్తి చేశారని, మిగిలిన లక్ష్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. గ్రౌండ్ వాలిడేషన్ ధ్రువపత్రాలకు సంబంధించి 33,326కి గాను 16,578 పంపిణీ చేయడం జరిగిం దన్నారు. రీసర్వే మౌలిక సదుపాయాలు, పట్టాలు రూపొం దించడానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీకి మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి జిల్లా ప్రాజెక్ట్ పర్యవేక్షణకోసం ఒక బృందాన్ని నియమించామన్నారు. ఇందులో ఈవోపీఆర్డీ ఎస్వీ రాంప్ర సాద్, పంచాయతీ కార్యదర్శి ఎస్కే బాబ్జీ, గ్రామ కార్యదర్శి పి.రామకృష్ణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె.రాజేష్ ఆధ్వర్యంలో క్షేత్రస్ధాయి పనుల పురోగతిపై రోజువారీ ప్రగతిని పర్యవేక్షి స్తామన్నారు. ఈ పథకం ద్వారా ఆస్తి యజమానులకు చట్టపరమైన యాజమాన్య కార్డులను జారీ చేస్తుందన్నారు. సర్వేను క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలననుసరించి పూర్తిచే యాలని స్పష్టంచేశారు. కార్యక్రమంలో డీజీపీవో శాంతామ ణి, జిల్లా సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.