Share News

2010 మంది పెన్షనర్ల లైఫ్‌ సర్టిఫికెట్లు ఆమోదం

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:26 AM

జీవన్‌ప్రమాణ్‌లో అప్‌లోడ్‌ చేసిన లైఫ్‌ సర్టిఫికెట్లు అన్నింటినీ ఆమోదించినట్టు అమలాపురం ఉపఖజానా అధికారి బీవీవీ రంగారావు తెలిపారు. సబ్‌ట్రెజరీ పరిధిలో 2010మంది పెన్షనర్లు జీవన్‌ప్రమాణ్‌లో లైఫ్‌ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయగా వాటిని ఆమోదించినట్టు తెలిపారు.

 2010 మంది పెన్షనర్ల లైఫ్‌ సర్టిఫికెట్లు ఆమోదం

అమలాపురం టౌన్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జీవన్‌ప్రమాణ్‌లో అప్‌లోడ్‌ చేసిన లైఫ్‌ సర్టిఫికెట్లు అన్నింటినీ ఆమోదించినట్టు అమలాపురం ఉపఖజానా అధికారి బీవీవీ రంగారావు తెలిపారు. సబ్‌ట్రెజరీ పరిధిలో 2010మంది పెన్షనర్లు జీవన్‌ప్రమాణ్‌లో లైఫ్‌ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయగా వాటిని ఆమోదించినట్టు తెలిపారు. కార్యాలయం పరిధిలో 2893మంది పెన్షనర్లు ఉండగా 2010 మందికి ఆమోదం లభించిందన్నారు. 883మంది పెన్షనర్లు తమ జీవన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కోనసీమ జిల్లాశాఖ ప్రతినిధుల బృందం రాష్ట్ర కార్యదర్శి ఎన్వీఎస్‌ఎస్‌సీహెచ్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏటీవో రంగారావును కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన పెన్షనర్లు కూడా తమ లైఫ్‌ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాశాఖ అసోసియేట్‌ అధ్యక్షుడు ఎం.సాయివరప్రసాద్‌, కోశాధికారి జయంతి సోమేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:26 AM