గలీజుదారులు!
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:47 AM
అవకాశం ఇస్తే గుడిని.. గుడిలో లింగాన్ని మింగేసే ఘనులున్నారు.. కూర్చోవడానికి చోటిస్తే పడుకోవడానికి చోటడిగే ప్రబుద్ధులున్నారు.. ఎందుకంటే దేవుడి భూమిని లీజుకు తీసుకుని ఆక్రమించేసేవారు ఎక్కువైపోయారు.. తనది కాని భూమి కోసం న్యాయం చేయమని కోర్టులను ఆశ్రయుస్తున్నారు..

ఆస్తులు ఘనం..ఆదాయం కనం
వందేళ్లుగా వేలం పాటలే లేవు
సత్రం భూములు అన్యాక్రాంతం
137 ఎకరాలు..రూ.16 లక్షలు
అయినా శిస్తు చెల్లించని వైనం
కోర్టులకు కౌలుదారులు
మామూళ్ల మత్తులో అధికారులు
కన్నెత్తిచూడని వైనం
రాజానగరం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : అవకాశం ఇస్తే గుడిని.. గుడిలో లింగాన్ని మింగేసే ఘనులున్నారు.. కూర్చోవడానికి చోటిస్తే పడుకోవడానికి చోటడిగే ప్రబుద్ధులున్నారు.. ఎందుకంటే దేవుడి భూమిని లీజుకు తీసుకుని ఆక్రమించేసేవారు ఎక్కువైపోయారు.. తనది కాని భూమి కోసం న్యాయం చేయమని కోర్టులను ఆశ్రయుస్తున్నారు..అయినా అధికారులు పట్టించు కోకుండా వదిలేస్తున్నారు.. దీంతో దాతల ఆశయం నీరుగారిపోతోంది.. ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. శ్రీరాజా కాండ్రేగుల జోగి జగన్నాఽథరావు పంతులు బహద్దూర్.. ఈ పేరు కూడా ఇప్పటి తరానికి తెలియదు. కానీ రాజానగరంలో అన్నదాన సత్రానికి ఏకంగా 188.89 ఎకరాలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ భూములు సమస్యల్లో చిక్కుకున్నాయి. కౌలు రైతులు ఆ భూములు మావేనంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. జిల్లాలో ఈ ఒక్క సంఘటనే కాదు.. ఆలయ భూములను లీజుకు తీసుకుని ఆక్రమించేసేవారు ఎక్కువైపోయారు. బాటసారులకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పం తో వందలాది ఎకరాల భూములను ధారాదత్తం చేసిన దాత ఆశయాలకు కొందరు స్వార్థపరులు తూట్లు పొడుస్తున్నారు. నామమాత్రపు శిస్తులు కూడా చెల్లించకుండా కౌలుదారులు కోర్టులను ఆశ్రయిస్తూ అధికారులను సైతం కోర్టు బోనుల్లో నిలబెడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖలోని కొంత మంది అధికారులు తప్పుడు సలహాలిస్తూ కౌలుదారు లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దశాబ్దాల తరబడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న వందలాది ఎకరాల అన్నదాన సత్రం భూ ములు కోర్టు కేసులతో మగ్గిపోతున్నాయి.
భూములపై లీజుదారుల కన్ను
శతాబ్దాల కిందట శ్రీరాజా కాండ్రేగుల జోగి జగన్నాఽథరావు పంతులు బహద్దూర్ అనే జమిం దారు వాహన సౌకర్యాలు కూడా లేని రోజుల్లో మచిలీపట్నం నుంచి గుర్రం మీద పెద్దాపురం కప్పం వసూలుకు వెళ్లి వస్తూ రాజానగరంలో సేద తీరేవారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో దారినపోయే బాటసారులకు గుప్పెడు మెతు కులు పెట్టాలనే ఉద్దేశంతో రాజానగరంలో అన్న దాన సత్రం ఏర్పాటు చేశారు. వందలాది ఎక రాలను అన్నదాన సత్రానికి సమకూర్చారు.కొన్నేళ్ల పాటు అన్నదానం స జావుగానే సాగింది. అయితే సత్రం సిబ్బ ందిపనితీరుతో పాటు బాటసారులు రావడం తగ్గింది.దీంతో సత్రం సిబ్బంది అన్నదానాన్ని అట కెక్కించి జేబులు నింపుకునే పనిలో పడ్డా రు. భూముల ధరలు పెరుగుతున్న తరుణంలో కొంతమంది లీజుదా రులు భూములపైనే కన్నేశారు.శిస్తులు చెల్లించ కుండా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
సాగులో 137.78 ఎకరాలు
వందలాది ఎకరాల భూములను ధారపోసిన జమిందారు శ్రీరాజా కాండ్రేగుల జోగి జగన్నా ఽథరావు పంతులు బహద్దూర్ వారి అన్న దాన (ఫీడింగ్) సత్రానికి సంబంధించిన 188.89 ఎకరాల భూములు సమకూర్చారు.వీటిలో 47. 12 ఎకరాలు పేదల నివాస స్థలాలకు ప్రభు త్వం తీసుకుంది.పులిమేరులో 3.99 ఎకరాలు ఆక్రమణల్లో చిక్కుకున్నది.ప్రస్తుతం 137.78 ఎక రాలు కౌలు వ్యవసాయం కొనసాగుతుంది. వార్షి కాదాయం రూ.16లక్షలకు మించి రావడం లేదు. ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి కౌలుదారులు,దేవాదాయశాఖ అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరించడం వల్ల ఆదాయ కుం టుపడిపోతోందని ఆరోపిస్తున్నారు. కొంత మం ది తక్కువ లీజు ఇస్తుంటే.. మరికొందరు కోర్టుల ను ఆశ్రయిస్తున్నారు.మూడేళ్లకోసారి పాట నిర్వ హించాల్సి ఉన్నా మామూళ్ల మత్తులో జోగు తున్న అధికారులు చాలా ఏళ్లగా అటు వైపే చూడకపోవడం గమనార్హం. శతాబ్దాలుగా వేలం వేయలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.జిల్లా అధికారులైనా దృష్టి సారించారా అంటే అదీ లేదు. దాత ఆశయాలు నీరుగారుతున్నాయి.
భూములు ఎక్కడెక్కడంటే...
ఈ సత్రానికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విలువైన పంట భూములు ఉన్నా యి.పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో సర్వే నెంబరు 107లో 2.19 ఎకరాలు, సర్వే నెంబరు 108లో 4.11 ఎకరాలు, 109లో 3.3 ఎకరాలు,120లో 4.64 ఎకరాలు భూములు ఉన్నాయి. సర్వే నెంబరు 189లో 2.5 ఎకరాలు, 189లో 1.81 ఎకరాలు, 190లో 0.73 సెంట్లు, 193లో 1.45 ఎకరాలు, 98లో 0.98 ఎకరాలు భూములు ఉన్నాయి.రాజానగరంలో సర్వే నెం బరు 135లో 11.97 ఎకరాలు, 161/1లో 3.49 ఎకరాలు, 161/1లో 0.53 సెంట్లు, 164లో 3.08 ఎకరాలు, 165లో 3.54 ఎకరాలు, 20లో 2.87 ఎకరాలు, 27లో 5.48 ఎకరాలు, 28లో 7.10 ఎకరాలు, కలవచర్లలో సర్వే నెంబరు 342లో 14.11 ఎకరాలు రికార్డులో ధఖలు పడి ఉన్నా యి. ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో సర్వే నెం బరు 242లో 4.54 ఎకరాలు, 252లో 2.96 ఎకరాలు, 342లో 2.11 ఎకరాలు, 345లో 0.74 ఎకరాలు, 348లో 7.22 ఎకరాలు, 350లో 1.99 ఎకరాలు, 364లో 6.38 ఎకరాలు, 365లో 6.90 ఎకరాలు, 629లో 2.39 ఎకరాలు, 632లో 2.78 ఎకరాలు ఉన్నాయి.దేవరపల్లి మండలం త్యాజం పూడి గ్రామంలో సర్వే నెం బరు 245లో 35.05 ఎకరాలు,378/2లో 9.36 ఎకరాలు,385లో 12.73 ఎకరాలు,387/1లో 5.57 ఎకరాలు ఉన్నా యి. కురుకూరులో సర్వే నెంబరు 350/3లో 5.76 ఎకరాలు,426లో 9.37 ఎకరాలు ఉన్నాయి.
ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి
పులిమేరు గ్రామంలోని 3.99 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది.దేవరపల్లి మండలం త్యాజ ంపూడిలోని ఉన్న 35 ఎకరా ల్లోని 27 ఎకరాలకు సంబంధించి కౌలుదారుడు శిస్తులు ఎగవే యడంతో కోర్టు వివాదంలో కొనసాగుతుంది. ఇటీవల రాజానగరంలోని 25.16 ఎకరాల భూమిని ఎండోమెంట్ అధికారులు స్వాధీ నం చేసుకుని బహిరంగ వేలం నిర్వహించారు. ఇదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న భూములకు బహిరంగ వేలం నిర్వహిస్తే మరింత ఆదా యం సమకూరుతుందని పలువురు రైతులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారిం చి దేవాదాయ ధర్మాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.