ఆడాళ్లు.. మీకు జోహార్లు
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:59 AM
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన జాతికి ఎందరో నారీమణులు ఖ్యాతి తెచ్చారని, రాజకీయ, సినీ, సంగీతం, క్రీడలు ఇలా అనేక రంగాల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని పలుచోట్ల శనివారం ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
పలువురు మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సత్కారాలు
రాజానగరం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన జాతికి ఎందరో నారీమణులు ఖ్యాతి తెచ్చారని, రాజకీయ, సినీ, సంగీతం, క్రీడలు ఇలా అనేక రంగాల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని పలుచోట్ల శనివారం ఘనంగా నిర్వ హించారు. నియోజకవర్గ కేంద్రమైన రాజానగ రంలోని రాయల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఏర్పా టు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే విచ్చేసి మాట్లా డారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలం టూ విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సరైన భాగ స్వామ్యం తప్పనిసరన్నారు. సమాజంలో ఒక మ హిళను బలపరిస్తే ఆమె కుటుంబాన్ని బలపరు స్తుందని, కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం మహి ళల అభ్యున్నతికి పాటుపడుతున్న పలువురిని నాసేన కోసం నావంతు కోఆర్డినేటర్ బత్తుల వెం కటలక్ష్మి సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మండారపు సీతారత్నం, బీజేపీ ఇన్‌చార్జి నీరుకొం డ వీరన్నచౌదరి, ఎంపీడీవో జేఏ ఝాన్సీ, ఐసీడీ ఎస్ సీడీపీవో టి.నాగమణి, తహశీల్దార్ జి.అనం తలక్ష్మి సత్యవతిదేవి తదితరులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో కలవచర్ల పంచాయతీ పరి ధిలో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ను సన్మానించారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. గైట్ ఫార్మసీ కళాశాల విద్యార్థిని లాలిత్యకు వివేకానంద సేవా శ్రమం నుంచి మహిళా ధాత్రి పురస్కారం లభిం చింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశిష్ట గుర్తింపు సొంతం చేసుకున్న మహి ళలకు ఇటీవల కడప జిల్లాలోని ఓబుళాపురంలో ఈ పురస్కారాలు అందజేశారు. లాలిత్య ఎన్‌ఎస్ ఎస్ వలంటీర్‌గా ఆరో గ్యం, బాలికల శ్రేయస్సుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రిన్సిపాల్ ఎండీ ధనరాజు, ఎన్ ఎస్‌ఎస్ పీవో షేక్ మీరా, వైస్ ప్రిన్సిపాల్ రామచంద్రన్, అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.