కోరుకొండ ఆలయంలో మద్యం,మాంసం పొట్లాలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:08 AM
అదొక పవిత్ర పుణ్యక్షేత్రం.. అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం.. అటువంటి పుణ్య క్షేత్రంలోనూ పాపం.. పుణ్యం అనే మాటే లేదు.చారిత్రాత్మక కోరుకొండ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో టేబుల్స్‌పై ఉంచిన మద్యం బాటిల్స్ ఫొటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కానరాని చర్యలు
కోరుకొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : అదొక పవిత్ర పుణ్యక్షేత్రం.. అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం.. అటువంటి పుణ్య క్షేత్రంలోనూ పాపం.. పుణ్యం అనే మాటే లేదు.చారిత్రాత్మక కోరుకొండ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో టేబుల్స్‌పై ఉంచిన మద్యం బాటిల్స్ ఫొటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్రమైన ఆలయాన్ని పాడు చేస్తున్నారు.. ఇష్టానుసారం వినియోగించుకుంటున్నారు.. అయినా పట్టించుకునేవారే లేరు.. కనీసం చర్యలు చేపట్టిన వారూ కానరావడంలేదు. 24 గంటల పాటు సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాలు ఉండే ఆలయ ప్రాంగణంలోకి మద్యం బాటిల్స్ ఎలా వచ్చాయనేది ప్రశ్నా ర్థకంగా మారింది. వీటిని ఎవరుపెట్టారో, ఎందుకు పెట్టారో నిగ్గు తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మద్యం బాటిల్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత దేవస్థానం సిబ్బంది తీరిగ్గా కోరుకొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం మౌఖికంగా చెప్పినట్టు తెలిసింది. గత రెండు రోజులుగా కోరుకొండ దేవస్థానం కార్యాలయంలో మద్యం బాటిల్స్, మాంసం పొట్లాలు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు భక్తులను బాధించాయి. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు ఆలయానికి వచ్చి ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవస్థానం కార్యాలయంలోకి మద్యం సీసాలు, మాంసం పొట్లాలు ఎలావచ్చాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై కోరుకొండ ఎస్‌ఐ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ కోరుకొండ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం నుంచి ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదన్నారు.అయితే మౌఖికంగా మాత్రమే విష యం తెలిపారన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.