Share News

తగ్గేదేలే!

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:55 AM

కోడీ.. పోలీస్‌ దొంగాట మళ్లీ మొదలైంది.. ఒకరు ఆడనివ్వమంటుంటే.. పందెగాళ్లు మా త్రం వారి ఏర్పాట్లలో వారున్నారు.. ప్రజ లం తా సంక్రాంతి సందడిలో ఉంటే.. మరో పక్క కోడిపందేల బరులు రూ.లక్షలతో సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలోనూ కోడిపందేల బరులు సిద్ధం అ య్యాయి.

తగ్గేదేలే!
తాళ్లపూడిలో పందెం బరి ధ్వంసం చేస్తున్న పోలీసులు

గ్రామాల్లో పందేల బరులు సిద్ధం

కుదరదంటున్న పోలీస్‌ శాఖ

నాయకుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌

నాలుగు గ్రామాలకో బరి

ఒక చోట బరి రూ.16 లక్షలు

గుండాటకు రూ.10 లక్షలు

ఏర్పాట్లలో నిర్వాహకులు

మరో పక్క పోలీసుల దాడులు

ఇంకనూ పట్టువీడని పోలీస్‌

భయపడని పందెగాళ్లు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

కోడీ.. పోలీస్‌ దొంగాట మళ్లీ మొదలైంది.. ఒకరు ఆడనివ్వమంటుంటే.. పందెగాళ్లు మా త్రం వారి ఏర్పాట్లలో వారున్నారు.. ప్రజ లం తా సంక్రాంతి సందడిలో ఉంటే.. మరో పక్క కోడిపందేల బరులు రూ.లక్షలతో సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలోనూ కోడిపందేల బరులు సిద్ధం అ య్యాయి. పోలీసులు ప్రతి ఏటా సంక్రాంతి ఆరంభంలో కోడిపందేలు ఆడనిచ్చేదిలేదని హెచ్చరికలు జారీ చేయడం, తర్వాత నెమ్మ దిగా లాఠీలు దించేసి మౌనం వహించడం షరా మామూలే. ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలో ప్రజాప్రతినిధులు కోడిపందేలకు గ్రీన్‌సిగ్న ల్‌ ఇచ్చారు.ముఖ్య ప్రజాప్రతినిధులు కార్య కర్తల వరకూ అనుమతులిచ్చి వారు మా త్రం లావాదేవీలకు దూరంగా ఉంటే, ఒక ఎమ్మెల్యే మీఇష్టానుసారం కోడిపందాలు, గుండాటలు ఆడుకోండి..నాది నాకు పంపిం చండి అంటూ పార్టీ వర్గాలతో చెప్పడం పెద్ద చర్చనీయాంశమైంది.రాజానగరం, అన పర్తి, రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు ఊళ్ల ఒక ట్రెండు బరులను సిద్ధం చేస్తున్నారు. రాజ మహేంద్రవరం డివిజన్‌లోని ఒక నియోజ కవర్గంలో ఒక గ్రామంలో బరికి రూ.16 లక్ష లు వేలం వెళ్లింది. మరో నియోజకవర్గంలో ఒక గ్రామంలో గతంలో మూడు గ్రూపులు విడిపోయి మూడు బరులు వేసిన వారంతా ఒకటై ఒకే బరి వేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ గుండాట పాట రూ.10 లక్షల వర కూ వెళ్లినట్టు తెలిసింది. పోలీసులు, ఇతర అధికారులు కోజ మాంసం అడుగుతున్నట్టు సమాచారం. గతేడాది ఒక బరి నుంచి సుమారు 100 కోజలు ఇచ్చినట్టు కథనం. ఈసారి 150 కోజల వరకూ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. సంక్రా ంతి పండుగ రాజకీయ నాయకులు, జూద గాళ్లు, కోడిపందేల నిర్వాహలు, కొందరు పోలీసులకు డబ్బులు తెచ్చేది మారింది. ఆదివారం నుంచి అన్నీ సిద్ధం చేస్తు న్నారు.కొందరు ముందుగానే పందేలు ఆరం భించాలనే యోచనలో ఉన్నారు. భోగి రోజు నుంచి ఇక ఎవరి ఇష్టం వారిది.

బరులు ధ్వంసం

తాళ్లపూడి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : రానున్న సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా జరుపు కోవాలని కోడి పందేలు, జూదాల వంటి వాటి జోలికి వెళ్లవద్దని తాళ్లపూడి తహశీల్దార్‌ బి.రవీంద్రనాథ్‌, కొవ్వూరు రూరల్‌ సీఐ విజయ బాబు హెచ్చరించారు. తాళ్లపూడి మండలంలోని కొన్ని గ్రామాల్లో కోడి పందేలకు సిద్ధం చేస్తున్న బరులను ఎస్‌ఐ రామకృష్ణ ధ్వంసం చేయించారు.

జూదక్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

రాజమహేంద్రవరంసిటీ,జనవరి11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ నేపద్యంలో జిల్లాలో కోడి పందేలు, పేకాటలు,గుండాటలు వంటివి నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్ప టికే జిల్లాలో చాలా చోట్ల బరులు ధ్వంసం చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.యువత జూదక్రీడల్లో పట్టుబడితే వారు భవిష్యత్‌లో ఉద్యోగాలు కోల్పోతారని స్పష్టం చేశారు. సంప్రదాయ క్రీడల్లో పాల్గొని కుటుంబంతో ఆనందంగా ఉండాలని హితవు పలికారు.

Updated Date - Jan 12 , 2025 | 12:55 AM