కేశవరం ప్రభుత్వ భూములపై రుడా ఆరా!
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:35 AM
రాజ మహేంద్రవరం రుడా పరిధిలోని మండపేట మండలం కేశవరం పంచాయతీలో ఉన్న ప్రభు త్వ భూములు 33 ఎకరాలపై రుడా అధికారులు ఆరా తీస్తున్నారు.

పారిశ్రామికవాడ ఏర్పాటుకోసం త్వరలో ఆయా భూముల పరిశీలన
వేములపల్లి ఏపీఐఐసీ భూములను
ఇళ్ల స్థలాలుగా మార్చేసిన గత ప్రభుత్వం
దీంతో కేశవరం భూములపై దృష్టి
మండపేట, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాజ మహేంద్రవరం రుడా పరిధిలోని మండపేట మండలం కేశవరం పంచాయతీలో ఉన్న ప్రభు త్వ భూములు 33 ఎకరాలపై రుడా అధికారులు ఆరా తీస్తున్నారు. రాజమహేంద్రవరం నగరానికి సమీపంలోనే కేశవరంలో సర్వే నెంబరు 81, 82, 85లలో 36 ఎకరాల వరకు ఈ ప్రభుత్వ భూ ములు ఉన్నాయి. ప్రస్తుతం రెవెన్యూశాఖ ఆఽధీ నంలో ఉన్న ఈ భూములను సద్వినియోగం చేసేలా కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇం దులో భాగంగా ఇక్కడ చిన్నతరహా పరిశ్రమ లను ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతను పారి శ్రామికవేత్తలుగా తయారుచేసేలా చర్యలు చేప ట్టింది. గతంలో ద్వారపూడి పంచాయతీ పరిధి లోని వేములపల్లిలో ఏపీఐఐసీ ద్వారా ప్రభు త్వానికి చెందిన 33 ఎకరాలను సేకరించి రూ.6 కోట్ల వ్యయంతో రోడ్లు, వంతెనలు, ఇతర వస తులు కల్పించారు. పారిశ్రామికంగా ఇక్కడ అభి వృద్ధికి పునాదులు పడుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ భూములను జగనన్న లేఅవుట్‌గా మార్చేసి ఇళ్ల స్థలాలుగా ఇచ్చేశారు. దాంతో ద్వారపూడిలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు నిలిచిపోయిం ది. ఇప్పుడు మళ్లీ మండపేట మండలం కేశవ రంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఎలా ఉంటుందనే ఆలోచనతో రుడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈమేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి సమాచా రం సేకరించడంతోపాటు సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నా రు. కేశవరంలో ఇప్పటికే పలు పరిశ్రమలు, శీత లపానీయాల పరిశ్రమ ఉంది. ఇక్కడ పరిశ్రమ లు ఏర్పాటుచేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు యువ పారిశ్రా మికవేత్తలు తయారయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేశవరంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు భారీ గోతులు చేసి మరీ గ్రావెల్‌ను తరలించుకుపోవడంతో గోతుల మయంగా ఆయా భూములు మారిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వానికి చెందిన భూ ముల్లో గ్రామ పంచాయతీ కంపోస్టు యార్డుకు సంబంధించి ఐదెకరాలను కేటాయించారని సమాచారం. ఇక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తే కంపోస్టు యార్డుకు కేటాయించిన స్థలం రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు. కేశవరంలో ప్రభుత్వ భూములు ఎంతమేరకు ఉన్నాయన్న దానిపై మండపేట మండల తహశీల్దార్ తేజేశ్వ రరావును వివరణ కోరగా 33 ఎకరాల ప్రభుత్వ భూములను తమ ఆఽధీనంలో ఉంచుకున్నామ న్నారు. ప్రభుత్వ అవసరాల మేరకు భూమిని దేనికైనా వాడుకునే వీలుందన్నారు. ఇప్పటికే తమ నుంచి ఖాళీ భూములపై ప్రభుత్వం సమాచారం తీసుకుందని చెప్పారు. ఇదిలా ఉండగా కేశవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తమ పంచాయతీ నుంచి భూములకు సంబంధించిన సమాచారం, రికార్డులను సేకరించారని.. త్వర లోనే రుడా అధికారులు భూముల పరిశీలన చేసి ఇవి దేనికి అనుకూలమనే అంశం పరిశీ లిస్తామని చెప్పినట్టు తెలిపారు.