పోలీస్‌శాఖ డ్రోన్‌లతో స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:43 AM
కాకినాడ క్రైం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాలతో మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ పై జిల్లా పోలీస్‌శాఖ డ్రోన్‌లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 92 ద్విచక్రవాహనాలను సీజ్ చేసింది. ఎస్పీ జి.బింధుమాధవ్ ఆదేశాలతో ట్రా ఫిక్ అడ్డంకులు నివారించే దిశగా డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా లేకుండా మార్గం

92 వాహనాలు సీజ్
కాకినాడ క్రైం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాలతో మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ పై జిల్లా పోలీస్‌శాఖ డ్రోన్‌లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 92 ద్విచక్రవాహనాలను సీజ్ చేసింది. ఎస్పీ జి.బింధుమాధవ్ ఆదేశాలతో ట్రా ఫిక్ అడ్డంకులు నివారించే దిశగా డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా లేకుండా మార్గం సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్-1, 2 సీఐలు ఎన్.రమేష్, డి.రామారావు ఆధ్వ ర్యంలో పలు ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై, రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలపైన డ్రోన్ కెమెరాను ఉపయోగించి వినూత్నంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 92 కేసులను నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో మైనర్ డ్రైవింగ్‌కు సంబంధిం చి 4 కేసులు, మోడిఫైడ్ సైలెన్సర్లకు సంబంధించి 5 కేసులు, రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి 6 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి 6 కేసులు, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించి 31 కేసులు, ట్రిపుల్ రైడ్ సంబంధించి 40 కేసులను నమోదు చేశామన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను టోయింగ్ వాహనాల సహయంతో ట్రాఫిక్-2 పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. వాహనదారులు ఇక నుంచి నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని లేదంటే డ్రోన్ నిఘానేత్రం వెంటాడుతుందని ఎస్పీ హెచ్చరించారు.