Share News

ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:50 AM

కలెక్టరేట్‌(కాకినాడ), జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకా యిలు త్వరలో చెల్లించనుందని కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీని వాస్‌ వెల్లడించారు. కాకినాడ పీఆర్‌ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో బుధవారం యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభల ముగింపు కార్యక్రమం జరిగింది. స

ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయం
సభలో మాట్లాడుతున్న ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్ల అభివృద్ధి

కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌

ముగిసిన యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభలు

కలెక్టరేట్‌(కాకినాడ), జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకా యిలు త్వరలో చెల్లించనుందని కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీని వాస్‌ వెల్లడించారు. కాకినాడ పీఆర్‌ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో బుధవారం యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభల ముగింపు కార్యక్రమం జరిగింది. సభకు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షే మమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చెం దుతున్నాయన్నారు. జలజీవన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.21వేలకోట్లు ఏపీకి మంజూరు చేసింద న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో భారీఎత్తున పరిశ్రమలు రానున్నాయన్నారు. ఎన్డీఏ అధి కారంలోకి రావడంలో యూటీఎఫ్‌ ఉపాధ్యా యుల పాత్ర కూడా ఉందన్నారు. యూటీ ఎఫ్‌ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

సభలో కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి యూటీఎఫ్‌ నిరంతరం ఉపాధ్యాయుల కోసం పనిచేస్తుందన్నారు. కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ తిరుపాణ్యం మాట్లా డుతూ 140ఏళ్ల చరిత్ర కల్గిన రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభు త్వ కళాశాల ఇదేనని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 67 దేశాల్లో వివిధ ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నారన్నారు. యూటీ ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ మున్సిపల్‌, మోడల్‌స్కూల్‌, పంచాయతీరాజ్‌, కస్తూరిబా పాఠ శాలలు ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు యూటీఎఫ్‌ కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల కోసం యూటీఎఫ్‌ కార్యాచరణ రూపొం దించిందన్నారు. ఫిబ్రవరి 17వతేదీ నుంచి కార్యక్రమాలు ప్రార ంభిస్తామన్నారు. దీని కోసం తొలుత ఫిబ్రవరి 2న విజయ వాడలో సదస్సు నిర్వహిస్తామని తర్వాత ఉత్తరాంధ్ర, గోదా వరి జిల్లాలు, ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో ఉండా లని.. అవసరమైతే ఎల్‌కేజీ, యూకేజీలు కూడా వీటిలో నిర్వ హించాలని తీర్మానించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృ భాషలో జరగాలని తీర్మానించారు. హైస్కూల్‌లో రెండు మీడి యంల్లో బోధన కొనసాగాలన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్య దర్శి గిరిధర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం, సాంకేతిక స్పృహ పెంచాలని ఆయన కోరారు.

పలు తీర్మానాలు

ముగింపు సభలో పలు తీర్మానాలు చేశారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, 117 జీవో రద్దు చేయాలని తీర్మానించారు. ప్రాథమిక పాఠశాల వ్యవస్థ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పునరుద్ధరించాలని, హైస్కూల్‌లో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం ల్లో కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు కల్పించాలి. 12వ నూతన వేతన సవరణ సంఘం నియమించాలి. మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని తీర్మానించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. ఉపాధ్యా యులపై ఉన్న యాప్స్‌ భారం తగ్గించాలి. ప్రభుత్వ పాఠశాల లను, ప్రభుత్వ విద్యను బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. జాతీయ నూతన విద్యావిధానం 2020ను రద్దు చేయాలి. కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ సాధన, జూనియర్‌ లెక్చరర్స్‌ పదోన్న తులు, మున్సిపల్‌ టీచర్లు, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. ఇలా మొత్తంగా 15 తీర్మానాలు చేశారు. సభ ఏకాగ్రీవంగా వాటిని ఆమోదిం చింది. అనంతరం యూటీఎఫ్‌ సాంస్కృతిక పోటీల్లో విజేతలకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు అందజేశారు.

నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు

నూతనంగా ఎన్నికైన యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గానికి ఎమ్మెల్సీలు గోపిమూర్తి, కేఎస్‌ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి ఉపాధ్యాయుల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేయాలని ఆకాంక్షించారు. మహాసభలు విజయవంతంఅవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహా సభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నగేష్‌, చక్రవర్తిలు ధన్యవాదాలు తెలిపారు. అన్ని కార్యక్రమా లు విజయవంతానికి కృషిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 01:50 AM