Share News

శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన కాకి నాడ ఫైబర్‌ బోటు

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:32 AM

కాకినాడ సిటీ/ కె.గంగవరం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన ఫైబర్‌ బోటును శ్రీలంక సముద్ర జలాల్లో సోమవారం రాత్రి గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక జగ న్నాధపురం పరదేశమ్మపేటకు చెందిన పం తాడి బ్రహ్మానందం కేరళలో రూ.40 లక్షలు పెట్టి ఫైబర్‌ బోటు కొనుగోలు చేసి కాకినాడ తీసు

శ్రీలంక సముద్ర జలాల్లో  పట్టుబడిన కాకి నాడ ఫైబర్‌ బోటు
మసకపల్లిలో కర్రి నూకరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న సర్పంచ్‌

నలుగురు మత్స్యకారుల అరెస్ట్‌

కాకినాడ సిటీ/ కె.గంగవరం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన ఫైబర్‌ బోటును శ్రీలంక సముద్ర జలాల్లో సోమవారం రాత్రి గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక జగ న్నాధపురం పరదేశమ్మపేటకు చెందిన పం తాడి బ్రహ్మానందం కేరళలో రూ.40 లక్షలు పెట్టి ఫైబర్‌ బోటు కొనుగోలు చేసి కాకినాడ తీసుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. రామేశ్వరం బ్రిడ్జి దిగువ నుంచి రావాల్సిన బోటు జీపీఎస్‌ సాంకేతిక లోపం వల్ల చుట్టుతిరిగి ప్రయాణిస్తూ శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆ దేశ గస్తీ సిబ్బంది ఫైబర్‌ బోటు, అందులోని నలుగురు మత్స్యకారులను అదుపులోకి తీసు కుని ఇక్కడి మత్స్యశాఖ అధికారులకు సమా చారం తెలిపారు. అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల్లో పంతాడి బ్రహ్మానందం, చింతా నాగేశ్వరరావు, కర్రి నూకరాజు, కొప్పాడి శ్రీను ఉన్నారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందు కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండ బాబు జిల్లా అధికారులతో మాట్లాడారు. శ్రీలం కలో అరెస్టుయిన మత్స్యకారుల్లో ఒకరైన కర్రి నాగరాజు అత్తగారి గ్రామం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండ లంలోని మసకపల్లి. నాగరాజు అరెస్టుతో గ్రామ ంలోని వారి కుటుంబం ఆందోళనకు గురైంది. ఆందోళన చెందవద్దని సర్పంచ్‌ పల్లి అన్నపూర్ణ కళ్యాణ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అరెస్టయిన నలుగురిని తిరిగి భారత్‌కు తీసుకువస్తామని మత్స్యకార సంఘం నాయకుడు కర్రి చిట్టిబాబు తెలిపారు. మంగళవారం ఆయన కోటిపల్లిలో విలేకర్లతో మాట్లాడారు. దీనిపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మా ట్లాడి శ్రీలంక అధికారులతో సంప్రదింపులు జరి పామని, త్వరలోనే వారిని దేశానికి తీసుకువ స్తామని ఆయన చెప్పారు. ఆయా కుటుంబాలు వారు ఆందోళన చెందవద్దని కోరారు.

Updated Date - Aug 06 , 2025 | 01:32 AM