పన్నుల వసూళ్లలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:45 AM
కార్పొరేషన్(కాకినాడ), ఫిబ్రవరి 22(ఆంధ్ర జ్యోతి): పన్నుల వసూళ్లే లక్ష్యంగా నగరపాలక అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొండిబకాయిల వసూల కోసం డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు కమిషనర్ భావన శారదమ్మగుడి వద్ద గల నరగపాలక సంస్ధ కార్యాల

కాకినాడ కమిషనర్ భావన
కార్పొరేషన్(కాకినాడ), ఫిబ్రవరి 22(ఆంధ్ర జ్యోతి): పన్నుల వసూళ్లే లక్ష్యంగా నగరపాలక అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొండిబకాయిల వసూల కోసం డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు కమిషనర్ భావన శారదమ్మగుడి వద్ద గల నరగపాలక సంస్ధ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయాల సిబ్బందితో సమావేశమయ్యారు. పన్ను ల వసూలు విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని కమిషనర్ సూచించారు. ముఖ్య ంగా పన్నుల చెల్లింపు విషయంలో ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రతీ వార్డుకు నోడల్ ఆఫీసర్, అడ్మిన్, సెక్రటరీలను ఏర్పాటు చేసి పన్నుల వసూలు బాధ్యత అప్పగించాలని సూచించారు. ఆయా డివిజన్లలో మొండి బకాయిదారుల నుంచి పన్నుల ను వసూలు చేయడంలో వీరందరూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. వార్డులోని పన్నులను నోడల్ ఆఫీసర్, సర్కిల్ పరిధిలోని పన్నులు ఆయా సర్కిల్ ఆఫీసర్లు వసూలు చేయాలన్నారు. పన్నులపై ఏప్రిల్ నుంచి వడ్డీ పెరిగే అవకాశముందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే మార్కెట్ రేటు పెరిగిన నేపథ్యంలో పన్నులు రివైజ్ చేసే అవకాశముందని ఆ విషయాన్ని కూడా వివరించి ప న్ను బకాయిలను త్వరితగతిన చెల్లించేలా అవ గాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె.మనోహర్, నగరపాలక కార్యదర్శి శ్రీకాం త్‌రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ, ఆర్‌వో శిరీష్, టీపీఆర్వో శైలజ, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.