Share News

కేన్సర్‌ ఆసుపత్రి అంకాలజీ విభాగం ఏర్పాటుకు ప్రదేశాల పరిశీలన

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:46 AM

కలెక్టరేట్‌(కాకినాడ), ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): కాకినాడలో నూతనంగా నిర్మించనున్న కేన్సర్‌ ఆసుపత్రి అంకాలజీ విభాగం ఏర్పాటు కు అనువైన ప్రదేశాలను గురువారం జిలా ్లకలెక్టర్‌ షాన్‌మోహన్‌ పరిశీలించారు. అనంత రం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణం పక్కన ఉన్న మున్సిపల్‌ అతిథి గృహం స్థలాన్ని సం

కేన్సర్‌ ఆసుపత్రి అంకాలజీ విభాగం ఏర్పాటుకు ప్రదేశాల పరిశీలన
స్థల పరిశీలన చేస్తున్న కలెక్టర్‌

కలెక్టరేట్‌(కాకినాడ), ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): కాకినాడలో నూతనంగా నిర్మించనున్న కేన్సర్‌ ఆసుపత్రి అంకాలజీ విభాగం ఏర్పాటు కు అనువైన ప్రదేశాలను గురువారం జిలా ్లకలెక్టర్‌ షాన్‌మోహన్‌ పరిశీలించారు. అనంత రం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణం పక్కన ఉన్న మున్సిపల్‌ అతిథి గృహం స్థలాన్ని సందర్శించారు. కాకినాడ బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్మించిన 500 పడకల నూతన సమీకృత ఆయుర్వేద ఆసుపత్రిని ఆయుష్‌ వైద్య అధికారులు, ఏపీఎంఎస్‌ఐడీసీ, జీపీటీ కళాశాల సిబ్బందితో కలిసి పరిశీలించారు. చివ రి దశకు చేరుకున్న సమీకృత ఆయుర్వేద ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు, ఆసుపత్రికి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి అవసర మైన స్థలం, కేన్సర్‌ ఆసుపత్రికి అనువైన ప్రదేశాలను మ్యాప్‌ల ద్వారా పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, అర్బన్‌ తహశీల్దార్‌ జితేంద్ర, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ రత్నరాజు, డీఈ చక్రవర్తి, ఆయుష్‌ వైద్య అధికారులు డాక్టర్‌ మహమ్మద్‌ షాజన్‌ ఆలీ, శ్రీనివాసు, జీపీటీ ఇన్‌చార్జి సంజయ్‌ తదితరులున్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:47 AM