మార్పు మీతోనే సాధ్యం
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:47 AM
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయులే సమాజంలో మార్పు తీసుకురాగలరనీ, ఉన్నతమైన సమాజ నిర్మాణం వారి ద్వారానే జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ పేర్కొన్నారు. కాకినాడ పీ ఆర్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల్లో భాగంగా మూడో రోజు ప్రతినిధుల సభ జరిగింది. సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించా రు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడు తూ
గురువులే మార్గదర్శులు
నా తల్లిద్రండులు కూడా టీచర్లే
అది నాకు దక్కిన అదృష్టం
3వ రోజు యూటీఎఫ్ స్వర్ణోత్సవంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయులే సమాజంలో మార్పు తీసుకురాగలరనీ, ఉన్నతమైన సమాజ నిర్మాణం వారి ద్వారానే జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ పేర్కొన్నారు. కాకినాడ పీ ఆర్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల్లో భాగంగా మూడో రోజు ప్రతినిధుల సభ జరిగింది. సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించా రు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడు తూ ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. తన తల్లిద్రండులు కూడా ఉపా ధ్యాయులు కావడం తన అదృష్టమన్నారు. ఉపా ధ్యాయులు విద్యను బోధించడం ద్వారా సమా జాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. స మాజాన్ని ప్రభావితం చేసేవారిలో ఉపాధ్యా యులే ముందు వరుసలో ఉంటారన్నారు. తన తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్ల తమ గృహంలో ఎలాంటి పెళ్లిళ్ల కార్య క్రమం జరిగినా ఆహ్వాన పత్రికలు ముందు ఉ పాధ్యాయులకే అందిస్తామని, దీని వల్ల చిన్న నాటి నుంచి ఉపాధ్యాయుల సాధక బాధలు తనకు పూర్తిగా తెలుసునన్నారు. నోబెల్ పొజిష న్‌లో ఉన్న ఉపాధ్యాయులంతా ప్రతి రోజు ఒక మంచి సానుకూల దృక్పథంతో ముందడుగు వేయడం ద్వారా మరింత మందిని ప్రభా వితం చేయగలరన్నారు.సభకు వచ్చిన ఉపాఽధ్యాయులు, మేధావులకు శుభకాంక్షలు తెలిపారు.
జగన్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడు తూ యాభైఏళ్ల ఉపాధ్యాయ ఉద్యమంలో తాను కూడా భాగస్వామ్యం అయ్యానని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని... 3,4,5 తరగతులను హై స్కూల్‌లో కలిపి చాలా తప్పిదం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వ మైనా విద్యావ్వవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. నేటి సమాజంలో సంఘంలో ఐక్యత తీసుకురావడానికి ఉపాధ్యా యులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రానున్న పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలుపించుకోవాలని పిలుపు నిచ్చా రు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అందరూ కలిసి రక్షించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాల లో ఖాళీలను నింపాలని డిమాండ్ చేశారు. ఉ పాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలన్నారు. 2007నుంచి ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతు లభించిన పట్టభద్రులు, ఎమ్మెల్సీలు 14సార్లు గెలుపొందారన్నారు. మార్చిలో జరిగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ అ భ్యర్థిగా నిలబడుతున్న విజయగౌరీని.. కృష్ణ, గుం టూరు జిల్లాల నుంచి పట్ట భద్రుల ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న తనని గెలిపించాలని కోరారు. తూర్పు, పశ్చిమగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని 2రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.
విద్యారంగాన్ని కాపాడుకోవాలి
యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో విద్యారంగం ప్రపంచబ్యాంకు కను సన్నల్లో నడుస్తుందన్నారు. పేద వర్గాలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ప్ర మాదకర పరిస్థితిలో ఉన్న విద్యారంగాన్ని కాపాడుకోవాలన్నారు. రానున్న రోజుల్లో 24వేల ప్రభుత్వ పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలలుగా మారబోతున్నాయన్నారు. పార్లమెంటులో చట్టం చేయకుండా కేంద్రం తెచ్చిపెట్టిన నూతన విద్యా చట్టం 2020 విద్యా వ్యాపారానికి అనుకూలం గా ఉందన్నారు. గత విద్యా మహాసభలో యూటీ ఎఫ్ సభ్యత్వం 80వేలు ఉండగా ఈ 17వ విద్యాసభకు అది కాస్తా లక్ష దాటిందన్నారు. ఉపాధ్యా యులకు ఉండే నిబద్ధతకు ఇదే ప్రతీక అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుల, మత, ప్రాంత వర్గాలకు అతీ తంగా యూటీఎఫ్ ఉపాధ్యాయులు సమాఖ్యం గా పోరాటం చేయాలన్నారు. మంచి సమాజాన్ని నిర్మించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి సంఘం ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. ఐక్య ఉపా ధ్యాయ పత్రిక నివేదికను రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మల్లేశ్వరరావు, ప్రచురణల కమిటీ నివేది కను హనుమంతురావు, మహిళా కమిటీ నివేదికను కుసు మకుమారి, రాష్ట్ర యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం నివేదికను మనోహర్ కుమార్‌లు ప్రవేశపెట్టగా కమిటీ ఏకా గ్రీవంగా తీర్మానించింది. అనంతరం యూటీఎఫ్ అకాడ మిక్ అంశాల్లో ప్రతిభ చూపినవారికి జ్ఞాపికలను అందించారు. అనంతరం విప్లవగీతాలు, సాంస్కృ తిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అఽధ్యక్షుడు శ్రీనివాస రావు, ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, కుసుమ కుమారి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు కే.నగేష్, పి.చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శులు అరుణ కుమారి, సుభాషిని, కిషోర్‌కుమార్, మోహన్ రావు, శ్రీలక్ష్మీ, సుభాషిని, అన్నారాం, జ్యోతిబసు, యూటీఎఫ్ కృషిరాష్ట్ర పత్రికాభాద్యులు ఐ.ప్రసా ద్‌రావు, చిలుకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేటితో స్వర్ణోత్సవాల ముగింపు
గత 3రోజులుగా పీఆర్ కళాశాలలో జరుగు తున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు బుధ వారంతో ముగుస్తాయి. బుధవారం యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకుని ప్రకటిస్తారు