Share News

కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:25 AM

కలెక్టరేట్‌(కాకినాడ), ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి): కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ (శుద్ధి చేసిన వ్యర్థాల నుంచి తయారైన గ్యాస్‌)ప్లాంట్‌ ఏర్పా టుకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా ్లకలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహు ల్‌మీనాతో కలిసి జిల్లాలో కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై చర్చించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్ర భుత్వం ఇటీవల ఇంటి గ్రేటెడ్‌ క్లీ

కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టరేట్‌(కాకినాడ), ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి): కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ (శుద్ధి చేసిన వ్యర్థాల నుంచి తయారైన గ్యాస్‌)ప్లాంట్‌ ఏర్పా టుకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా ్లకలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహు ల్‌మీనాతో కలిసి జిల్లాలో కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై చర్చించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్ర భుత్వం ఇటీవల ఇంటి గ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ కింద జీవ ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సా హకాలను తీసుకువచ్చిందన్నారు. ఇంటిగ్రేట్‌ కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ ప్లాంటును రిలయన్స్‌ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నదన్నారు. ఈ కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఐదేళ్లపాటు సుస్థిర మూలధనం పెట్టుబడిపై 20శాతం, స్టేట్‌ జీఎస్టీ పూర్తిరియంబర్సెమెంట్‌, ఐదేళ్ల పాటు విద్యుత్‌ రాయితీ ఇవ్వనున్నదన్నారు. సాంప్రదాయ వనరులపై ఆధారపడడం తగ్గించడంతోపాటు వ్యర్థాలను శక్తిగా మార్చ డం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దోహదపడు తుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజె క్టులు ఏర్పాటు చేయనున్నాదన్నారు. ఈ ప్లాం టుకు అనువైన భూములను గుర్తించాలన్నారు. ప్రధానంగా అటవీ, అసైన్డ్‌ భూముల వివరాలు సేకరించి నివేదిక సమర్పిచాలన్నారు. కార్యక్రమ ంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు మల్లిబా బు, శ్రీరమణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:25 AM