ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచాలి : కలెక్టర్
ABN , Publish Date - Feb 25 , 2025 | 01:28 AM
కలెక్టరేట్(కాకినాడ), ఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవల్లో నాణ్యత, ప్రజల సంతృప్తిస్థాయి పెంచేలా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవల్లో ప్రజాభిప్రాయంపై జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు అందించడంలో కాకినాడ జిల్లాను రా
జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం
కలెక్టరేట్(కాకినాడ), ఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవల్లో నాణ్యత, ప్రజల సంతృప్తిస్థాయి పెంచేలా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవల్లో ప్రజాభిప్రాయంపై జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు అందించడంలో కాకినాడ జిల్లాను రాష్ట్రంలో మంచి స్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్య క్రమాన్ని చేపట్టిందన్నారు. ఐవీఆర్‌ఎస్, వాట్సాప్, క్యూఆర్ కోడ్ విధానంలో ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరి స్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రులు, దేవాలయాలు, మున్సిపాలిటీలు, ఆర్టీసీ, హెచ్‌వోడీ కార్యాలయాలు, రెవెన్యూ, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్, వైద్యసేవలు, పురపాలక సేవలలో పన్నులు, ఇసుక విక్రయాలు, నిత్యవసర సరుకులు పంపిణీ, దీపం-2 పథకం అమలు తీరు తదితర సేవలపై ప్రజాభిప్రాయసేకరణకు ఐవీఆర్‌ఎస్. వాట్సాప్, క్యూఆర్ కోడ్ విధానం అమలవుతుందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు పొందేలా ప్రభుత్వం వాట్సాప్ నెంబర్, క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసిందన్నా రు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో అన్ని సేవలు ఆన్‌లైన్ చేయా లన్నదే ప్రభుత్వం ఆలోచన అని రేషన్‌కార్డుల మొదలు అన్ని సేవ లు ప్రజలకు చాలా సులభంగా ఆన్‌లైన్‌లోనే అందించే దిశగా అడు గులు వేస్తుందన్నారు. అన్నిశాఖల వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రే టెడ్ అవ్వాలన్నారు. వాట్సాప్ ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు అం దాలంటే 95523 00009 నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ ఓపె న్ అవుతుందని, మీకు కావలసిన పౌరసేవలను ఎంచుకోవచ్చు నన్నారు. అలాగే కులధ్రువపత్రం, ఆదాయం, మ్యారేజ్ తదితర సర్టిఫికెట్లు ఈ వాట్సాప్ ద్వారానే పొందవచ్చన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ భావన, వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు, మున్సి పల్ కమిషనర్లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.