Share News

‘కూటమి అభ్యర్థిని గెలిపించండి’

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:24 AM

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన గల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజ శేఖర్‌కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్మధిక మెజారిటీతో గెలిపించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పట ్టభద్రులను కోరారు. కాకినాడ బార్‌ అసోసి యేషన్‌లో

‘కూటమి అభ్యర్థిని గెలిపించండి’
కాకినాడలో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన గల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజ శేఖర్‌కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్మధిక మెజారిటీతో గెలిపించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పట ్టభద్రులను కోరారు. కాకినాడ బార్‌ అసోసి యేషన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ న్యాయవాదుల ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో కాకినాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొ న్నారు. ఒక్కో కార్యకర్త 30 మంది పట్టభద్రుల ఓటర్లను కలవాలని, కూటమి అభ్యర్థి పేరాబ త్తుల రాజశేఖర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో సిటీ నియోజకర్గ పరిధిలోని స ర్కిల్‌ క్టస్లర్లు, ఎమ్మెల్సీ వార్డుల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కొం డబాబు అఽధ్యక్షత వహించి మాట్లాడారు. అభ్య ర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రతీ ఓటర్‌ను కలిసి తనకు ఓటు వేసేలా ప్రచారం సాగించాలని కోరారు. సమావేశంలో టీడీపీ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, మాజీ కార్పొరేటర్లు వొమ్మి బాలాజీ, పలివెల రవి, తుమ్మల సునీత, నాయకులు గదుల సాయిబాబు, బుచ్చ శేఖర్‌, సీకోటి అప్పలకొండ, నల్లూరి శ్రీనివాస్‌, అంబటి చిన్న, అమలకంటి బలరామ్‌, రెడ్నం సత్తిబాబు, పాలిక నాని, చోడిపల్లి సతీష్‌, మూగు రాజు, గాది శివ, లూటుకుర్తి మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:24 AM