సామూహిక ఎలుకల నిర్మూలనతో సత్ఫలితాలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:26 AM
సామర్లకోట, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1.75 లక్షల పైబడి ఎకరాల్లో దాళ్వా వరిసాగు అయ్యిందని, వరిపంటలో 20 శాతం వరకూ పిలకలను ఎలుకలు కొరికివేయండతో పంట దిగుబడులు తగ్గుతున్నాయని ఇది గమ నించిన ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా వ్యాప్తంగా సామూహిక ఎలుకల నిర్మూలన చేడుతుందని జిల్లా వ్యవసాయాధి కారి ఎన్.విజయకుమార్ పేర్కొన్నారు. సామర్ల కోట మండలం అచ్చంపేట రైతు సేవా కేంద్రం ఆవరణలో మం

సామర్లకోట, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1.75 లక్షల పైబడి ఎకరాల్లో దాళ్వా వరిసాగు అయ్యిందని, వరిపంటలో 20 శాతం వరకూ పిలకలను ఎలుకలు కొరికివేయండతో పంట దిగుబడులు తగ్గుతున్నాయని ఇది గమ నించిన ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా వ్యాప్తంగా సామూహిక ఎలుకల నిర్మూలన చేడుతుందని జిల్లా వ్యవసాయాధి కారి ఎన్.విజయకుమార్ పేర్కొన్నారు. సామర్ల కోట మండలం అచ్చంపేట రైతు సేవా కేంద్రం ఆవరణలో మండలఎంఏవో ఐ.సత్య ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఏవో మాట్లాడుతూ ఎలుకలు ఉలి వంటి మంద పండ్లతో వస్తువులను సులభంగా కొరుకుతాయ ని, ఈ పండ్లు రోజుకు 0.4 మి.మీ. వంతున పెరుగుతాయన్నారు. ఇలా నిత్యం పెరుగుతూ పోతే ఆ దంతాలు కపాలాన్ని చీల్చుకుపోవడం జరిగి ఎలుక మరణిస్తుందన్నారు. రైతులందరూ ఒకే సమయంలో సమష్టిగా ఎలుకల నిర్మూలన చేపట్లాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల రైతు సేవాకేంద్రాలకు వ్యవసాయా శాఖ ద్వారా బ్రోమోడయోలిన్ మందును ఉచి తంగా పంపిణీ చేస్తున్నారన్నారు. దీంతో ఎలు కల నిర్మూలన సాధ్యపడి పంటనష్టం నుంచి రైతులు కొంతమేర ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. డీఏవో, ఎంఏవో బ్రోమోడయోలిన్ మందు ప్యాకెట్లను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో వీరంరెడ్డి పెదబా బు, పెద్దిరెడ్డి బాబ్జీ, యాళ్ళ కాశీవిశ్వనాధం, ముమ్మిడి శ్రీనివాసు, బుర్రా చక్రధర్, వింటి బాబ్జీ ఉన్నారు.