Share News

కాలనీలు చూస్తే.. ఆగవు కన్నీళ్లు!

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:14 AM

జగనన్న కాలనీల పేరు చెబితే సమస్యలే గుర్తొస్తాయి.. గత ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్లిస్తామని జిల్లాలో 429 లేఅవుట్లు వేసి మొదటి దశ కింద 45,051 ఇళ్లు,సొంత స్థలాలు ఉన్న వారికి 17,573 ఇళ్లు మంజూరు చేశారు.

కాలనీలు చూస్తే.. ఆగవు కన్నీళ్లు!
వెలుగుబంద జగనన్న కాలనీలో కానరాని రోడ్లు

గత ప్రభుత్వంలో పట్టని వైనం

మొదటి దశలో 62,624 ఇల్లు

26,179 ఇళ్లు మాత్రమే పూర్తి

మిగిలిన వాటి సంగతి అంతే

ముందుకు సాగని నిర్మాణాలు

యజమానుల ఇబ్బందులు

అప్పుల పాలైన పేదలు

నేటికీ తేరుకోని వైనం

ఇళ్ల నిర్మాణాలపై కూటమి దృష్టి

ఇప్పుడిప్పుడే కదులుతున్న వైనం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

జగనన్న కాలనీల పేరు చెబితే సమస్యలే గుర్తొస్తాయి.. గత ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్లిస్తామని జిల్లాలో 429 లేఅవుట్లు వేసి మొదటి దశ కింద 45,051 ఇళ్లు,సొంత స్థలాలు ఉన్న వారికి 17,573 ఇళ్లు మంజూరు చేశారు. వైసీపీప్రభుత్వం ఓట్ల కోసం హడావుడి చేసింది తప్పితే నివాసయోగ్యంగా మాత్రం చేయలేదు. కాలనీల్లో కనీసం రోడ్లు లేవు.. డ్రైనేజీలు లేవు.. మంచినీటి సదుపాయమూలేదు..స్థలాలు అయి నా బాగున్నాయా అంటే అదీ లేదు. ఊరికి దూ రంగా పొలాల మధ్య, కొండల ప్రాంతం, పల్లపు ప్రాంతాలు.. శ్మశానాల చెంత లేఅవుట్లు వేశా రు.. లేఅవుట్లను మెరక చేయలేదు.కొన్ని లేఅ వుట్లు కాగితాలపైనే ఉన్నాయి.భూ సేకరణలో అవినీతికి పాల్పడ్డారు. చివరకు ఇల్లు కట్టుకోక పోతే స్థలం తీసేసుకుంటామని భయపెట్టారు. తప్పని పరిస్థితుల్లో చాలా మంది అసౌకర్యాల మధ్యే ఇళ్లు కట్టుకున్నారు. దీంతో చాలా ఇళ్లు పునాది దాటలేదు. పేదింట అప్పులు మిగల డంతో లబోదిబోమంటున్నారు.

జిల్లాలో 429 లేఅవుట్లు

జిల్లావ్యాప్తంగా 429 లేఅవుట్లు వేశారు. 62, 624 ఇళ్లు మంజూరు చేయగా 45,051 శాంక్షన్‌ అయ్యాయి.వాటిలో కేవలం 12,264 పూర్త య్యాయి. సొంత స్థలం ఉన్న వాటిలో 17,573కి 13,915 పూర్తయ్యాయి. ఇంకా 2360 పునాదులే తవ్వలేదు.ఇక లేఅవుట్లలో 15,489 మొదలు కాలేదు.ఇలా జిల్లాలోని లేఅవుట్లు, సొంత స్థలం లో శాంక్షనైన ఇళ్లలోనే 17,849 ఇంకా మొదలు కాని పరిస్థితి ఏర్పడింది.మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. రాజమహేంద్రవరం నగర ప్రజలకు రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో 13 వేల మందికి పట్టాలు ఇచ్చారు. సుమారు 11 వేల ఇళ్లను అక్కడ మంజూరు చేశారు. 2856 ఇళ్ల నిర్మాణం సాగింది. అందులో 1600 శ్లాబ్‌ వరకూ వచ్చాయి. ప్రస్తుతం అక్కడ 70 కుటుంబాలు గృహ ప్రవేశాలు చేసుకున్నాయి. సుమారు 1000 ఇళ్ల వరకూ అసలు పునాదులు వేయలేదు. కొన్ని పునాదుల్లోనే ఆగిపోయాయి. వాటిలో మొక్కలు,తుప్పలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసింది.మార్చి నాటికి మరో 70 ఇళ్ల లో గృహ ప్రవేశాలు జరిగే అవకాశం ఉన్న ట్టు అధికారులు చెబుతున్నారు.మిగిలినచోట్ల ఇప్పుడి ప్పుడే ఇంటి నిర్మాణానికి ముందుకొస్తున్నారు.

మౌలిక సదుపాయాల్లేవు

జిల్లాలో చాలా లేఅవుట్లలో మౌలిక వసతు ల్లేవు. లేఅవుట్లు మెరక, పల్లాలు కూడా సరిచేయకుండా వదిలేశారు.రోడ్లు,విద్యుత్‌, మం చినీటి సౌకర్యాలు లేవు. డ్రైనేజీ సౌకర్యం లేదు. రవాణా సౌకర్యం పెద్ద సమస్యగా ఉంది. ఎం దుకంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడంతో ప్రస్తుతం ఇబ్బందిగా మారుతోంది. వెలుగుబందలో కనీసం రోడ్లు కూడా వేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కలెక్టర్‌ పి.ప్రశాంతి పలుదఫాలు వెలుగుబంద కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిపై ఆరా తీసి మెరుగు పరిచే ఆలోచన కూడా చేస్తున్నారు.

జగనన్న మోసం గురూ!

వేలాది మందిని పట్టాల బొమ్మ చూపించి వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. రాజమ హేంద్రవరంలో సుమారు 60 వేల మంది పేద లకు పట్టాలు ఇస్తున్నామని కోరుకొండ మండ లం బూరుగుపూడి ఆవలో అంటగట్టే ప్రయత్నం చేశారు.అయితే నాడు ప్రతిప క్షంలో టీడీపీ ఆందోళనతో వెనుతిరిగివచ్చారు. ఈ భూముల్లో పెద్ద కుంభకోణానికి పాల్ప డిన సంగతి తెలిసిం దే.ఆవ భూమిలో రైతుల చేత ముందుగా ఒప్పందం కుదుర్చు కుని,తక్కువ ధర పొలాలను ఎక్కువకు కొని డబ్బులు చేతులు మార్చుకున్నట్టు ఆరోప ణ లు వచ్చాయి.గత ఎన్నికల ముం దు వైసీపీ హడావిడిగా రాజానగరం మండలం లోని కానవరం,పల్లకడియం తదితర ప్రాంతాల్లో భూమిని కాగితాల్లో చూపి అక్కడ లేఅవుట్లు వేయకుండా పట్టాల మీద లబ్ధిదారుల పేర్లు రాసి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ భూములు ఎక్కడున్నాయో కూడా లబ్ధిదారులకు తెలియని పరిస్థితి. జి ల్లాలో అనేక చోట్ల ఇటువంటి పరిస్థితి నెల కొనడంతో లబ్ధిదారులు తమను వైసీపీ మో సం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏ నియోజకవర్గం చూసినా ఏముంది!

జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీ పేదల ఇళ్ల నిర్మాణ పరిస్థితి ఇలా ఉంది. అనపర్తిలో 9043 ఇళ్లు శాంక్షన్‌ అయ్యాయి. 1339 అసలు ప్రారంభించలేదు. 3590 పూర్త య్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. రాజమ హేంద్రవరం సిటీ పరిధిలో 11,712 ఇళ్లు శాంక్షన్‌ అయ్యాయి.3959 అసలు మొదలెట్ట లేదు. 2318 పూర్తయ్యాయి.మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. రాజానగరంలో 6800 ఇళ్లు శాంక్షన్‌ అయ్యాయి. 1179 అసలు మొదలె ట్టలేదు. 3942 పూర్త య్యాయి.మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. గోకవరం మండలంలో 493 ఇళ్లు శాంక్షన్‌ అ య్యాయి.5 అసలు మొదలెట్ట లేదు. 240 పూర్త య్యాయి.మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. కొవ్వూరులో 11,388 ఇళ్లు శాంక్షన్‌ అయ్యాయి. 2448 అసలు మొదలు పెట్టలేదు. 5410 పూర్త య్యాయి.మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నిడదవోలులో 12,130 ఇళ్లు శాంక్షన్‌ అయ్యాయి. 3465 అసలు మొదలు పెట్టలేదు.6664 పూర్త య్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. గోపాలపురంలో 6001 ఇళ్లు శాంక్షన్‌ అయ్యాయి. 3766 అసలు మొదలు పెట్టలేదు.1002 పూర్త య్యాయి.మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌లో 5056 ఇళ్లు శాం క్షన్‌ అయ్యాయి.1649 మొదలు పెట్టలేదు.2013 పూర్తయ్యాయి.మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.

Updated Date - Jan 06 , 2025 | 12:14 AM