Share News

తప్పిదం జరిగితే ఉపేక్షించం

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:02 AM

పరిశ్రమల్లో సాంకేతి అంశాలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి తప్పిదం జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని రసాయన, ఇతర పరిశ్రమ లను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి నివేదికలు సమ ర్పించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారు లను ఆదేశించారు.

 తప్పిదం జరిగితే ఉపేక్షించం
జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

  • పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలి

  • జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం రూరల్‌ ఫిబ్ర వరి 22(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల్లో సాంకేతి అంశాలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి తప్పిదం జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని రసాయన, ఇతర పరిశ్రమ లను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి నివేదికలు సమ ర్పించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారు లను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పారిశ్రా మిక ప్రోత్సాహిక కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షతన వహించి మాట్లాడారు. జిల్లాలోని కెమికల్‌ ఆధారిత, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు, వాటి నుంచి వెలువడే రసాయనా లను, వాయువుల స్థాయి ఎప్పటికపుడు పరిశీ లించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. అస్సాగో, ఏపీ పేప రు మిల్స్‌, ఠాగూర్‌ ల్యాబ్‌, ధరణి మెడికల్స్‌ వంటి పరిశ్రమలతో పా టు అన్ని పరిశ్రమల్లో సాంకేతిక అంశాలపై తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. సింగిల్‌ విండో విధానంతో అనుమ తులు ఒకేచోట ఇస్తున్నట్టు తెలిపారు. అప్లికే షన్లు పెండింగ్‌లో లేకుండా కార్యాచరణ వేగ వంతం చేయాలన్నారు. ఇందుకుగాను టైమ్‌ లైన్‌ ఇచ్చామన్నారు. జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్‌ అందించే ప్రక్రియ వేగవంతం చేయా లని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. మల్కా కార్టూన్‌ ఫ్యాబ్రిక్స్‌ వస్త్రాల తయారీలో సేంద్రీయ రంగుల అద్దకం, కుట్టు ప్రక్రియలో నైపుణ్యత గల వారికి శిక్షణను అందించే విధంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, జౌళి శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గిరిజన ఉత్పత్తుల ను స్థానికంగానే కాకుండా దేశ, అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయాలు జరిపేం దుకు ఆన్‌లైన్‌ సౌకర్యం కలిగించేలా తగిన చర్యలు తీసుకోవాల న్నారు. ఎంఎస్‌ఎంఈ ఇంటింటి సర్వేలో భాగం గా జిల్లాలో 92,980 యూనిట్లకు గాను ఇప్పటి వరకు 42,949 మాత్రమే మంజూరు చేశారని, మిగిలినవి కూడా వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారు ల ఎంపిక సర్వే పూర్తి చేయాలన్నారు. సమావే శంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కె.తిలక్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 01:02 AM