Share News

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:35 AM

ప్రజల్లో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంచడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి కేఎంఎంఆర్‌.ప్రసాద్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్లీనంకు హాజరై మాట్లాడారు.

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాద్‌

  • జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజల్లో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంచడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి కేఎంఎంఆర్‌.ప్రసాద్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్లీనంకు హాజరై మాట్లాడారు. చెడు అలవాట్ల నుంచి యువతను కాపాడుకోవడానికి వేదిక పనిచేయాలని కోరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా కె.భీమయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.రవిబాబు, ఉపాధ్యక్షులుగా వసంతరావు, ఏఎన్‌ సుధారాణి, శ్రీరాములు, కోశాధికారిగా తాతారావు, గౌరవాధ్యక్షులుగా మల్లికార్జునరావు, పైడియ్య, డాక్టర్‌ చైతన్యశేఖర్‌, మరికొందరు సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:35 AM