పేదింట..కలత తీరేలా!
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:06 AM
పేదింటికలను నెరవేర్చడానికి తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధానిలో శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు.

పల్లెల్లో 3..పట్టణాల్లో 2 సెంట్లు
జగనన్న కాలనీలు అధ్వానం
నివాసయోగ్యం కాకపోతే రద్దు
ఎన్‌టీఆర్ నగర్‌లుగా మార్పు
ఇక గృహ నిర్మాణం వేగవంతం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
పేదింటికలను నెరవేర్చడానికి తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధానిలో శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు.దీనిలో ప్రధానంగా కూటమి ప్రభు త్వం హామీగా ఇచ్చిన గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం కేటా యింపునకు నిర్ణయం తీసుకున్నారు.ఇక త్వరలో ఈ విధానం ద్వారా అనేక మంది పేదలకు ఇళ్ల పట్టాలు దక్కుతాయి.
నివాసయోగ్యం కాని స్థలాలు..
గత ప్రభుత్వం నివాస యోగ్యంకాని స్థలాల్లో లేఅవుట్లు వేసింది.. పేదలకు ఉచితంగా స్థలాలు ఇచ్చినా అనేక మంది ఇళ్లు కట్టుకోని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నివాసయోగ్యం కాని కాలనీల్లో కేటాయింపులను రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటి స్థలం ఇచ్చినా నివాసయోగ్యం కాకపోవ డం వల్ల ఇల్లు కట్టుకోలేని అనేక మంది పేదల కు మేలు జరగనుంది. ఇప్పటికే కూటమి ప్రభు త్వం గతంలో వైసీపీ నిర్మించిన కాలనీలకు ఎన్టీ ఆర్ నగర్‌గా నామకరణం చేసిన సంగతి తెలి సిందే.అందులో అనువైన ప్రాంతాలను మాత్ర మే కూటమి అభివృద్ధి చేయనుంది. గత వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల నివాసయోగ్యం కానీ స్థలాలు ఇచ్చి పేదలను ఇబ్బందులకు గురిచేసిం ది. కాలనీలు నిర్మిస్తామని చెప్పి అధ్వానంగా తయారు చేసి వదిలేసింది.ఈ నేపథ్యంలో చాలా చోట్ల లేఅవుట్లు అధ్వానంగా తయారయ్యాయి.
పేదల స్థలాలపై కూటమి దృష్టి
జిల్లాలో పేదలందరికీ ఇళ్లి స్తామని జిల్లాలో 429 లేవుట్లు వేసి, మొదటి దశ కింద 45,051 ఇళ్లు, స్వంత స్థలాలు ఉన్నవారికి 17,573 ఇళ్లు శాంక్షన్ చేశారు. కానీ లేఅవుట్లు ఇష్టానుసారు వేయడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భూ సేకరణలో అవినీతికి పాల్పడిన సంగతి తెలిసిం దే. అంతేకాక ఊరికి దూరంగా పొలాల మధ్య, కొండల ప్రాంతంలోనూ, పల్లపు ప్రాంతాల్లోనూ లేఅవుట్లు వేసి,తర్వాత వైసీపీ ప్రభుత్వం చేతు లెత్తేసింది.చాలా మంది ఇళ్లు కట్టుకోడానికి ముందుకు రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా లబ్ధి దారులకు మేలు చేసే ఆలోచనతో ముందుకెళు తోంది.జగనన్న కాలనీలను బాగు చేసి లబ్ధిదారు లకు అప్పగించడానికి తెలుగుదేశం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రయ త్నాలు ఆరంభించిం ది. ముందుగా కాలనీ పేరును పీఎంఎవై ఎన్టీఆర్ నగర్‌గా మార్చడం గమనార్హం.ఈ మే రకు శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చికి 3823 ఇళ్ల నిర్మాణమే లక్ష్యం..
జిల్లాలో జిల్లాలో శ్లాబ్ వరకూ వచ్చి ఆగి పోయిన ఇళ్లలో 3823 ఇళ్లను మార్చి నెలా ఖరు నాటికి పూర్తి చేసే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లా అధికారులకు మం డలాల వారీ టార్గెట్ ఇచ్చారు.జిల్లాలో ప్రస్తు తం 20,863 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఆగిపోయి ఉన్నాయి.ఇందులో పీఎంఎవై అర్బన్ కింద 17,124 ఇళ్లు, పీఎంఎవై గ్రామీణ కింద 2021- 22 నాటి ఇళ్లు 3309, గ్రామీణ కింద 2016-17, 17-18 నాటి ఎన్టీఆర్ ఇళ్ల కింద చేపట్టిన ఇళ్లు 9474 ఉన్నాయి. వీటిని వైసీపీ ఆపేసింది.వాటన్నింటిని పూర్తి చేయడా నికి కూటమి ఆదేశాలు జారీ చేసింది.
ఉచిత మీటర్లు ఇవ్వలేదని..కరెంట్ లాగేస్తున్నారు!
తాళ్లపూడి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాల నీలకు ఉచితంగా మీటర్లు ఇచ్చారు..నాడు ఆ మీటర్లతో విద్యుత్ ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇటీవల ఇళ్లు నిర్మించుకున్నవారికి ఉచిత మీటర్లు అం దివ్వలేదు.ఈ నేపథ్యంలో జగనన్న కాలనీవాసులు కరెంట్ వైర్ల నుంచి డైరెక్ట్‌గా విద్యుత్ తీసుకుని వాడేసుకుంటున్నారు.ఈ మేరకు సమాచారం అం దడంతో శుక్రవారం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట కాలనీలో విద్యుత్ అధికారులు సోదాలు చేశారు.కరెంట్ వైర్ల నుంచి విద్యుత్ వినియోగిస్తున్న 30 మందిపై కేసులు నమోదు చేశారు.దీంతో లబ్ధిదారులు లబోదిబో మం టున్నారు. ఉచిత మీటర్లు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.