Share News

సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన హోంగార్డు

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:02 AM

సర్పవరం జంక్షన్‌, జనవరి 15 ( ఆంధ్రజ్యోతి): సరదాగా సముద్ర స్నానం చేస్తోండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోతున్న వ్యక్తిని వాకలపూడి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోం గార్డు ప్రాణాలకు తెగించి రక్షించిన సంఘటన సూర్యారావుపేట బీచ్‌లో బుధవారం జరిగింది. వికాస్‌ పాండే అనే వ్యక్తి జీవనోపాధి కోసం ఉ

సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన హోంగార్డు
హోంగార్డు గంగాధర్‌కి బహుమతి ఇచ్చి సత్కరిస్తున్న మెరైన్‌ సీఐ రామ్మోహన్‌రెడ్డి

సర్పవరం జంక్షన్‌, జనవరి 15 ( ఆంధ్రజ్యోతి): సరదాగా సముద్ర స్నానం చేస్తోండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోతున్న వ్యక్తిని వాకలపూడి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోం గార్డు ప్రాణాలకు తెగించి రక్షించిన సంఘటన సూర్యారావుపేట బీచ్‌లో బుధవారం జరిగింది. వికాస్‌ పాండే అనే వ్యక్తి జీవనోపాధి కోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజమహేంద్రవరం వచ్చి భవనాలకు ఆల్టెక్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలసి బుధవారం మధ్యాహ్నం కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌కు వచ్చాడు. పలు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి పాండే కొట్టుకుపోతుండడంతో స్నేహితులు హాహాకారాలు చేశారు. అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న వాకలపూడి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ రామోహ్మన్‌రెడ్డి ఈ విషయాన్ని గుర్తి ంచి ఎస్‌ఐ సురేష్‌, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రాణాలకు తెగించి హోం గార్డు కె.గంగాధర్‌ (హెచ్‌జీ 408) సముద్రంలోకి వెళ్లి పాండేను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు. సముద్రం నీరు మింగేసిన పాండేకి మెరైన్‌ పోలీసులు సపర్యలు చేసి కోలుకునేలా చేశారు. ప్రాణాలకు తెగించి వికా స్‌ పాండేని కాపాడిన హోంగార్డు గంగాధర్‌కు బహుమతి ఇచ్చి మెరైన్‌ సీఐ రామ్మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. బందోబస్తు విధుల్లో ఉన్న మెరైన్‌ పోలీసులను అభినందించారు.

Updated Date - Jan 16 , 2025 | 01:02 AM