హైకోర్టు ఆదేశాలతో దివ్యాంగుల సర్వే
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:55 AM
హైకోర్టు ఆదేశాల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో దివ్యాంగులు, చిన్నారుల సర్వే నిర్వహించారు.

హైకోర్టు ఆదేశాలతో దివ్యాంగుల సర్వే
ఆలమూరు, పిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో దివ్యాంగులు, చిన్నారుల సర్వే నిర్వహించారు. ఆలమూరులో బుధవారం జరిగిన సర్వేలో ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తి నాగేశ్వరరావు నాయక్ ఆదేశాల మేరకు లీగల్ సర్వీసెస్ మండల ప్రత్యేకాధికారి న్యాయవాది కె.ధనరాజు నేతృత్వ ంలో కోర్టు, వైద్య ఆరోగ్య, ఆశ, పంచాయతీరాజ్ సిబ్బంది ఆలమూరులో సర్వే జరిపారు. ఒకటి నుంచి 19 ఏళ్లలోపు ఉన్న దివ్యాంగులు, అప్పుడే పుట్టిన చిన్నారులు, ఆరునెలలోపు ఉన్న వారి వివరాలను సేకరించారు. ఆలమూరు కోర్టు పరిధిలోని ఆలమూరు, మండపేట రూరల్, మండపేట టౌన్, కపిలేశ్వరపురం మండలాలలో సర్వే జరుగుతున్నదని ఆయన చెప్పారు.