ఆరికిరేవులలో సినిమా షూటింగ్
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:48 AM
కొవ్వూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాల

కొవ్వూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాకు మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్‌లు నటిస్తున్నారు. వివేక్ మార్విన్‌లు మ్యూజిక్ అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌గా సాగే చిత్రం కావడంతో మరో నెల రోజులపాటు కొవ్వూరు పరిసర ప్రాంతాలో చిత్ర నిర్మాణం జరుగుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు.