‘పాదగయ’లో సినీ నటుడు ఆది పూజలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:04 AM
పిఠాపురం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షే త్రాన్ని బుధవారం ప్రముఖ సినీనటుడు ఆది సందర్శించారు. కుటుంబస

పిఠాపురం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షే త్రాన్ని బుధవారం ప్రముఖ సినీనటుడు ఆది సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి కు క్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవి, పుర్హుతికాఅమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వేదపండితులు క్షేత్రప్రాశస్త్యాన్ని వివరించి ఆశీర్వచనాలు పలికారు. ఆదిని ఆలయ మర్యాదలతో ఈవో జగన్మోహన శ్రీనివాస్ సత్కరించి శేషవస్త్రాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.