Share News

లోడు లారీలతో ప్రయాణికులకు ఇక్కట్లు

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:39 AM

గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న భారీ వాహనాల రూటు మార్చాలని కూళ్ల తదితర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

లోడు లారీలతో ప్రయాణికులకు ఇక్కట్లు

కె.గంగవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న భారీ వాహనాల రూటు మార్చాలని కూళ్ల తదితర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గోదావరి నది పరీవాహక గ్రామాల్లో తాతపూడి, కపిలేశ్వర పురం వద్ద ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఈ ర్యాంపుల నుంచి ఇసుక లారీలు రామచంద్ర పురం, మండపేట నియోజకవర్గాలతో పాటు కాకినాడ జిల్లాలోని చాలా ప్రాంతాలకు తరలి స్తున్నారు. తాతపూడి, కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపుల్లో లోడు చేసుకున్న లారీలు ఏటిగట్టు నుంచి కోటిపల్లి వచ్చి అక్కడ నుంచి కాకినాడ పరిసర ప్రాంతాలకు వెళుతున్నాయి. మరి కొన్ని కూళ్ల వరకూ ఏటిగుట్టన వచ్చి అక్కడ నుంచి కూళ్ల-పామర్రు మీదుగా రామచంద్ర పురం నియోజకవర్గంలో పలు గ్రామాలకు ఇసుకను సరఫరా చేస్తున్నాయి. కాగా ఏటిగట్టు రహదారి, కూళ్ల-పామర్రు రహదారి సింగల్‌ రోడ్లు కావడంతో ప్రతిరోజూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఇసుక లారీలతో రహదారులు పాడవుతున్నాయని, భారీ వాహనాలు వస్తే రోడ్డు మార్జిన్‌ కూడా ఉండటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కార ణంగా మరమ్మతులకు నోచుకోక సింగిల్‌ రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో వాటి గుంతలు పూడ్చే పని చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ఇసుక లారీలు ఈ రోడ్లపై తిరిగితే రోడ్లు వెంటనే పాడవుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరో పిస్తున్నారు. ఏటిగట్టు వద్ద రోడ్డు ఎక్కిన లారీలు వాటిపై ఎక్కువ దూరం ప్రయాణించ కుండా ప్రభుత్వం చర్యలు చర్యలు తీసుకోవా లని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:39 AM