Share News

చిరు ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:18 AM

అన్నానికి బదులుగా చిరు ధాన్యాలను ఆహార ంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఐసీడీఎస్‌ రాయవరం ప్రాజెక్టు సూపర్‌వైజర్‌ సునీత అన్నారు.

చిరు ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

రాయవరం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): అన్నానికి బదులుగా చిరు ధాన్యాలను ఆహార ంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఐసీడీఎస్‌ రాయవరం ప్రాజెక్టు సూపర్‌వైజర్‌ సునీత అన్నారు. మంగళవారం రాయవరంలో చిరు ధాన్యాలపై తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సూపర్‌వైజర్‌ మాట్లాడుతూ మనిషి జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. అనారోగ్యం బారినపడి మందులు వేసుకోవడానికి బదులుగా చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడంతో తల్లి, బిడ్డలకు పోషకాలు లభించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. తల్లులకు చిరు ధాన్యాలతో చేసిన పదార్థాలను అందజేశారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సరోజిని, అంగన్‌వాడీ కార్యకర్తలు, పలువురు తల్లులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 01:18 AM