Share News

ఘనంగా భీష్మ ఏకాదశి

ABN , Publish Date - Feb 09 , 2025 | 12:07 AM

అంతిర్వేది ఏకాదశి సందర్భంగా శనివారం మండ లంలోని వేంకటేశ్వరస్వామి, విష్ణు ఆలయాల్లో భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. ఉద యాన్నే స్నానాలు ఆచరించి ఆలయాలను దర్శించారు. దేవరపల్లిలో సా యిబాబా ఆలయ వార్షికోత్స వం, భీష్మఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద లక్ష్మీనారా యణ శాంతి కల్యాణం, ప్రత్యేకహోమాలు నిర్వ హించారు.

 ఘనంగా భీష్మ ఏకాదశి
దేవరపల్లిలో శ్రీలక్ష్మీనారాయణ శాంతి కల్యాణం

  • వెంకన్న, విష్ణు ఆలయాలకు పోటెత్తిన భక్తులు

  • దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

దేవరపల్లి, ఫిబ్రవరి 8(ఆంధ్ర జ్యోతి): అంతిర్వేది ఏకాదశి సందర్భంగా శనివారం మండ లంలోని వేంకటేశ్వరస్వామి, విష్ణు ఆలయాల్లో భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. ఉద యాన్నే స్నానాలు ఆచరించి ఆలయాలను దర్శించారు. దేవరపల్లిలో సా యిబాబా ఆలయ వార్షికోత్స వం, భీష్మఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద లక్ష్మీనారా యణ శాంతి కల్యాణం, ప్రత్యేకహోమాలు నిర్వ హించారు. అనంతరం భా రీ అన్నసమారాధన జరిపారు. అలాగే బాలదుర్గ మ్మ, స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద ప్రత్యేకపూజలు, భజనలు ఏర్పాటు చేశారు. ఆయా దేవాలయాలను తెల్లవారు జాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యా ణం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ అంబటి శ్రీనివాసరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 12:08 AM