Share News

కాలుష్య రహిత సమాజానికి కృషిచేయాలి

ABN , Publish Date - Jan 19 , 2025 | 01:04 AM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని కాలుష్య రహిత సమాజానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.

కాలుష్య రహిత సమాజానికి కృషిచేయాలి

ముమ్మిడివరం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని కాలుష్య రహిత సమాజానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. అనాతవరంలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర దివస్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని రోడ్లుశుభ్రపరిచే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సర్పంచ్‌ మిమ్మితి చిరంజీవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు కురసాల శివబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుత్తుల సాయి, గొలకోటి దొరబాబు, శీలం వెంకటేశ్వరరావు, ఎంపీపీ కోలా గంగాభవానీ, జడ్పీటీసీ కుడుపూడి శంకరరావు, వాసంశెట్టి పట్టాభిరామయ్య, పెయ్యల పరశురాముడు, గుబ్బల తాతబ్బాయి, కుంచే శ్రీను, మునికోటి ఏసుబాబునాయుడు, అందే శ్రీను, యిళ్ల శ్రీను, పెయ్యల వెంకటరమణ, పేరిచర్ల సురేష్‌రాజు, నిమ్మన వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ మధుసూదన్‌, ఎంపీడీవో తాడి శ్రీవెంకటాచార్య, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, వెలుగు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 01:04 AM