Share News

గో..గో..గోల్డ్‌!

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:27 AM

గోల్డ్‌ ధర..గో..గో..గోల్డ్‌ అని ఎవరో తరు ముతున్నట్టు పరుగులు పెడు తోం ది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు దడ పుట్టిస్తోంది.

గో..గో..గోల్డ్‌!

24 క్యారెట్‌ తులం రూ.86,510

22 క్యారెట్‌ తులం రూ.79,300

కేజీ వెండి రూ.98,800

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

గోల్డ్‌ ధర..గో..గో..గోల్డ్‌ అని ఎవరో తరు ముతున్నట్టు పరుగులు పెడు తోం ది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు దడ పుట్టిస్తోంది.10 గ్రాముల ధర రూ.లక్ష అవుతుందేమోననే ప్రచారం జరుగు తోం ది. వెండి ధర పెరుగుతోంది. కేజీ వెండి ధర రూ.లక్షకు చేరువగా ఉంది. జనవరి నుంచి కేవలం ఫిబ్రవరికి నెల రోజుల్లో ధరలు పెరిగాయి.జనవరి ఒకటో తేదీన 22 క్యారెక్ట్‌ 10 గ్రాముల బం గారం ధర 71,500గా ఉంది. జనవరి నుంచి గురు వారం నాటికి రూ.7,800 పెరిగి 10 గ్రాముల ధర ఏకంగా రూ.79, 300కు చేరింది. రెండు రోజులు గా ఇదే ధర కొనసాగు తోం ది. ఇదే పెరుగు దల కొనసాగితే 10 గ్రాముల ధర రూ.80 వే లకు చేరవచ్చు. నెమ్మ దిగా రూ. లక్షకు చేరు తుందే మో ననే అంచనాలు న్నాయి. 24 క్యా రెక్ట్‌ 10 గ్రాముల ధర జనవరి 1న రూ.78 వేలుగా ఉంది. గురువారం 86,510కు చేరింది. శుక్రవా రం అదే ధర కొనసాగింది. నెల రోజుల్లో రూ.8,500 పెరిగింది.మాఘమాసం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ధరల పెరుగుదల కొనుగోలుదారులకు అదనపు భారమే.

వెండి కేజీ రూ.98,800

వెండి ధరలు పెరిగిపోతు న్నాయి. జనవరి 1న 88,400గా ఉన్న ధర గురువారం నాటికి రూ. 99 వేలకు చేరింది. మరో వెయ్యి పెరిగితే కేజీ వెండి ధర రూ.లక్షకు చేరుకునేది. కానీ శుక్రవారం రూ.200 తగ్గి 98,800లకు చేరింది. జనవరి నుంచి రూ.10,600 పెరిగింది.

Updated Date - Feb 08 , 2025 | 01:27 AM