Share News

బంగారం ధగధగలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:53 AM

బంగారం ధగధగలాడుతోంది. ధర రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్‌ అంచ నాల ప్రకారం ఆల్‌టైం రికార్డుగా చెబుతు న్నారు.

బంగారం ధగధగలు

రాజమహేంద్రవరం, జనవరి 24 ఆంధ్రజ్యోతి : బంగారం ధగధగలాడుతోంది. ధర రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్‌ అంచ నాల ప్రకారం ఆల్‌టైం రికార్డుగా చెబుతు న్నారు.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్య తలు స్వీకరించడం, స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉండడంతో బంగారం ధర పెరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. వచ్చేది మాఘ మాసం వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ఇటువంటి సమయంలో బంగారం ధరలు పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 16వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.73,900 ఉండగా ఇవాళ 75,550కు చేరింది. సుమారు వారంలో ఏకం గా రూ.1650లు పెరిగింది.ఇది ఆల్‌టైమ్‌ రికార్డుగా చెబుతున్నారు. మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్‌ కథనం. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,420 ఉంది. ఇది రికార్డు..నిపుణులు రూ.లక్ష వరకూ పెరగవచ్చని అంచనా వేస్తు న్నారు. వెండి కేజీ ధర రూ.93,700గా ఉంది. ఇటీవల మార్కెట్‌లో కొనుగోళ్లు పెరుగు తున్నాయి. సంక్రాంతి పండగ సీజన్‌లో కళకళలాడిన బంగారం దుకాణాలు, మధ్య లో కొంత తగ్గినా రెండురోజుల నుంచి మళ్లీ కళకళలాడుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలుదారులపై కొంత భారం పడుతు న్నట్టే చెప్పాలి. ముందుగానే కొనుగోలు చేసి దాచుకున్నవారికి మాత్రం పెరుగుతున్న ధర లు సంతోషాన్నిస్తున్నాయి.

Updated Date - Jan 25 , 2025 | 12:53 AM