Share News

గోదావరి చెంతన అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:06 AM

రాజమహేంద్రవరం గోదావరి చెంతన సంక్రాంతి సంబరాలు అంబరాన్నం టాయి. 15 రోజులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నగరంలో 42 డివిజన్లలో భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 15వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో 126 మందిని ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపికి చేసి మిగిలిన వారందరికీ కన్సోలేషన్‌ బహుమతులను ఏరోజుకారోజు అందించారు.

గోదావరి చెంతన అంబరాన్నంటిన  సంక్రాంతి సంబరాలు
రాజమహేంద్రవరం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

  • పుష్కరాల రేవు వద్ద సందడి

  • నగరంలో పల్లె వాతావరణం

  • 126 మందికి బహుమతులు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 11( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి చెంతన సంక్రాంతి సంబరాలు అంబరాన్నం టాయి. 15 రోజులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నగరంలో 42 డివిజన్లలో భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 15వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో 126 మందిని ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపికి చేసి మిగిలిన వారందరికీ కన్సోలేషన్‌ బహుమతులను ఏరోజుకారోజు అందించారు. విజేతలకు శనివారం సాయంత్రం పుష్కరాల రేవు వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రదానం చేశారు. దీనికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పా రావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, కుడుపూడి సత్తిబాబు, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, జనసేన నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ అధ్యక్షుడు బొమ్ము దత్తు విచ్చేశారు. పుష్కరాల రేవు వెలుపల ప్రాంగణం భోగిమంటలు, గంగిరెద్దుల సందడి, హరిదాసుల హరినామసంకీర్తనలతో సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చాలా కష్టాలు పడ్డామన్నారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో ఎన్నో చేశామన్నారు. బ్లేడు, గంజాయిబ్యాచ్‌లను అరికట్టామని, రూ.10 కోట్లు అభివృద్ధి పనులు చేశామని, రూ.20 కోట్ల పనులు ప్రారంభించామన్నారు. ఇంకా రూ.60 కోట్ల పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. గత పాలకులు చేసిన పనులు నగరానికి శాపంగా మారాయన్నారు. అన్ని లెక్కలు తెలుస్తామన్నారు. గన్ని కృష్ణ మా ట్లాడుతూ ఎమ్మెల్యే వాసు నగరాభివృద్ధికి ఎంత గానో కృషిచేస్తున్నారన్నారని, చక్కటి వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారన్నారు.ఆదిరెడ్డి అప్పా రావు మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాజమహేంద్రవరంలో అన్నిడివిజన్లలోను ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. అనంత రం 42 మంది ప్రథమ విజేతలకు సోఫాసెట్‌లు, 42 మంది ద్వితీయ విజేతలకు బీరువాలు, 42 మంది తృతీయ విజేతలకు డ్రస్సింగ్‌ టేబు ల్స్‌ను ముఖ్యఅతిథుల చేతులమీదుగా అందిం చారు. మహిళలంతా ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు, కాశి నవీన్‌కుమార్‌, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, రెడ్డి మణేశ్వరావు, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, యిన్నమూరి దీపు, ఎన్‌డీ వరప్రసాద్‌, కురగంటి సతీష్‌, కోసూరి చండిప్రియ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:06 AM