ఆదర్శప్రాయుడు గాంధీజీ
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:34 AM
కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గురువారం జాతిపిత మహాత్మగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గాంధీజీ చిత్రపఠానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఘనంగా జాతిపిత వర్ధంతి
నాయకులు, అధికారుల నివాళి
మల్లవరంలో గాంధేయం పుస్తకం ఆవిష్కరణ, కవిత గోష్టి
గాంధేయ కవిత రచయితలకు సత్కారం
కొవ్వూరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గురువారం జాతిపిత మహాత్మగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గాంధీజీ చిత్రపఠానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సుంకర సత్తిబాబు, గంగుమళ్ళ స్వామి, మద్దిపట్ల సురేష్ పాల్గొన్నారు. కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మట్టే ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్‌రోడ్‌లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొల్లేపర శ్రీనివాస్, మద్దుల సత్యనారాయణ, మన్యం గుప్తా, తుమ్మలపల్లి రమేష్, వంకాయల శివరామకృష్ణ పాల్గొన్నారు.