నిధులకు ఉదయ్‌మేదీ
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:55 AM
కాకినాడ పార్లమెంటు నియోజక వర్గంలో వింత పరిస్థితి నెలకొంది.

కలెక్టరేట్(కాకినాడ), ఫిబ్రవరి 22 (ఆంధ్ర జ్యోతి) : కాకినాడ పార్లమెంటు నియోజక వర్గంలో వింత పరిస్థితి నెలకొంది. ఎంపీ లాడ్స్ నిధులు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు కేటా యించడంలేదు.ఇతర నియోజకవర్గాల్లో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతుంటే ఇక్క డ పరిస్థితి భిన్నంగా ఉంది. చివరకు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలు సైతం బుట్ట దాఖలు కావడం విశేషం. దీంతో ఏడు నెల లుగా నిధులు ఖజానాలోనే మూలుగుతున్నా యి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జూలై నెలలో కాకినాడ పార్ల మెంటు నియోజకవర్గానికి ఎంపీ లాడ్స్ కింద రూ.5 కోట్లు విడుదలయ్యాయి.ఈ నిధులు 18వ లోక్‌సభలో 2024-25 సంవత్సరానికి కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులతో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని,జగ్గంపేట, పెద్దాపురం,ప్రత్తిపాడు నియోజ కవర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలి. అయితే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో నిధులున్నప్పటికీ అభివృద్ధికి గ్రహణం పట్టింది.
క్రతువు అంతా ఆన్‌లైన్‌లోనే
ఎంపీ లాడ్స్‌కు సంబంధించిన లావాదేవీ లన్నీ ఆన్‌లైన్‌లో చేసే విధంగా కేంద్ర ప్రభు త్వం రూల్స్ విధించింది. పనుల ప్రతిపాదనల దగ్గర నుంచి వాటి ఆమోదం, బిల్లుల చెల్లింపు వరకు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, డ్రైనేజీ, విద్యుత్‌శాఖల ద్వారా చేపట్టే పనులకు రూ.5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తారు. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో రూ.లక్ష వరకే నామినేషన్‌పై పనులు అప్పగిం చాలి. రూ.లక్ష దాటితే టెండర్లు పిలవాలనే నిబంధన ఉంది. ఈసారి కేంద్రం ప్రత్యేక అవ కాశం కల్పించింది. గతంలో పనులు చేపట్టి నిధులు లేకపోవడం వల్ల మధ్యలో నిలిచిపోతే ఈ నిధులు కేటాయించే అవకాశం కల్పించింది.
గత వైసీపీలో అధ్వానం
గత ఐదేళ్లు వైసీపీ హయాంలో ఎంపీ లాడ్స్ నిధులతో చేసిన పనులు అధ్వానంగా ఉన్నా యి. గత వైసీపీలో కాకినాడ ఎంపీకి రూ.20 కోట్లతో పనులు చేపట్టే అవకాశం కల్పించింది. అయితే పనులను సకాలంలో పూర్తి చేయలేక పోయారు. రూ.20 కోట్లతో 361 పనులు ప్రతి పాదించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేవలం రూ.10 కోట్లతో 156 పనులను మాత్రమే పూర్తి చేశారు. ఇంకా రూ.10 కోట్లతో 165 పనులను పెండింగ్‌లో ఉంచేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి ఎంపీ హడావుడిగా శంకుస్థాపన చేసి వదిలేశారు.
ఏప్రిల్‌లో మరో రూ.5 కోట్లు
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన మరో రూ.5 కోట్లు కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను విడుదల చేయనుంది. అయితే గతేడాది విడుదల చేసిన నిధులనే వినియోగించలేదు. కొత్తగా వచ్చే నిధులతో ఏం చేస్తారో తెలియ డం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.
ఆరుగురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు
కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో తమకు నిధులు కేటాయించాలని ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపి నట్టు తెలిసింది. వివిధ కారణాలను సాకుగా చూపుతూ వాటిని బుట్టదాఖలు చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల నియోజక వర్గాల్లో అభి వృద్ధి కుంటుపడుతుందని ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ప్రతిపాదనలను పరిశీలించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాధాన్యత ప్రకారం ఖర్చు చేస్తాం..
కాకినాడ పార్లమెంటు పరిధిలో ఈ నిధులను ప్రాధాన్యత ప్రకారం వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తాం. 7 నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రతిపా దనలను పరిశీలించి రోడ్లు, డ్రైన్లు, ప్రభుత్వ భవ నాలు వంటివి నిర్మిస్తాం. ఎంపీ నిధులు మురిగి పోయే అవకాశం లేదు. అభివృద్ధి పనులు వేగంగా చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం.
- ఉదయ్‌శ్రీనివాస్, కాకినాడ ఎంపీ