విజిబుల్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి: ఎస్పీ
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:51 AM
విజిబుల్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వ డంతోపాటు విద్యాలయాలు, హోటల్స్ వంటి ప్రదేశాల్లో నిఘా పటిష్టం చేయాలని ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశించారు.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): విజిబుల్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వ డంతోపాటు విద్యాలయాలు, హోటల్స్ వంటి ప్రదేశాల్లో నిఘా పటిష్టం చేయాలని ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశించారు. గురువారం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ని ఆయన తని ఖీ చేశారు. స్టేషను పరిసరాలను గమనించడంతోపాటు రికార్డులను పరిశీలించారు. స్టేషనుకు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించి సమస్యను పరిష్కరించే దిశగా సత్వర ప్రయత్నం చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని, బీట్ల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుండాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలను గమనిస్తూ అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలా పాలు నిర్వహించడం వంటివి చేసేవాళ్లను ఉపేక్షించవద్దన్నారు. స్టేషను పరిధిలోని నేరాలు, దర్యాప్తు వంటి అంశాలను సీఐ బాజీలాల్ వివరించారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేశ్‌బాబు పాల్గొన్నారు.