మహిళలకు మాత్రమే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:49 AM
యానాం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం పుదుచ్చేరిలోని మహిళలకు ఒక్కరోజు ఉచిత బోటు ప్రయాణం కల్పించింది. పు

ఒక్కరోజు ఉచిత బోటు ప్రయాణం
యానాం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం పుదుచ్చేరిలోని మహిళలకు ఒక్కరోజు ఉచిత బోటు ప్రయాణం కల్పించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి ఆదేశాల మేరకు పర్యాటకశాఖ ఆధీనంలో ఉన్న బోట్‌హౌస్‌లో ఈ సౌకర్యం కల్పించారు. దీంతో యానాం పర్యాటకశాఖ ఆధీనంలోని సీగల్స్ బోటుహౌస్‌లో మహిళలకు ఉచిత బోటు షికారు అవకాశం కల్పించారు. పలువురు మహిళ న్యాయవాదులు, టీచర్లు, ప్రజలతో పాటు బీచ్ పర్యాటనకు వచ్చిన మహిళలు యానాం గౌతమీ గోదావరిలో బోటులో విహరించారు. కార్యక్రమాన్ని యానాం పరిపాలనాధికారి మునిస్వామి,సీగల్స్ మేనేజర్ మురళిధరన్ పర్యవేక్షించారు.