Share News

చెరువుల్లో 3.23 లక్షల చేప పిల్లల విడుదల

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:27 AM

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 46 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎం ఎస్‌వై) పఽథకం ద్వారా 3 లక్షల 23 వేల 820 చేపపిల్లలను విడుదల చేసినట్టు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు.

చెరువుల్లో 3.23 లక్షల చేప పిల్లల విడుదల
నందరాడ చెరువులో చేప పిల్లలు విడుదల చేస్తున్న కలెక్టర్‌

రాజానగరం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 46 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎం ఎస్‌వై) పఽథకం ద్వారా 3 లక్షల 23 వేల 820 చేపపిల్లలను విడుదల చేసినట్టు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. రాజానగరం మండలం నందరాడలోని అడుసుమిల్లి వెంకయ్య చెరువులో కలెక్టర్‌ గురువారం చేపపిల్లలు విడుదల చేశారు.రాష్ట్రప్రభుత్వం ఉచితంగా మత్సకార సహకార సంఘాలకు చేప పిల్లలను సరఫరా చేసిందన్నారు. దీనివల్ల జిల్లాలోని మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల్లో చేపల ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు.ఈ చేప పిల్లల విడుదల వల్ల 36 మత్స్యకారుల సహకార సంఘాల్లోని 5300 కుటుంబాల జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. మూడు, నాలుగు నెలల్లో చేపపిల్లలు పెరిగి పట్టుకోవడానికి అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పీఎంఎస్‌వై కింద ఆక్వాజోన్‌లో ఉన్న చేపల చెరువులకు సబ్సిడీ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే చెరువులు తవ్వినాన్‌ఆక్వాజోన్లో ఉన్నవారికి కుడా ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు అనుమతులకు ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మత్సశాఖ అధికారి వి.కృష్ణారావు, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు బలసాడి రంగారావు, రాజానగరం తహశీల్దార్‌ జీఎఎల్‌ఎస్‌.దేవి, ఎంపీడీవో జెఎ.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:27 AM