10న నులిపురుగుల నివారణ దినం
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:05 AM
నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం (బొమ్మూరు)లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్రీయ బాలసాస్థ్య కార్యక్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లా డారు.

పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం (బొమ్మూరు)లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్రీయ బాలసాస్థ్య కార్యక్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లా డారు. ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 10, 17 తేదీల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న వారికి 10న ఒక మోతాదు, 17న మరో మోతాదు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, డీఎల్‌డీవో డాక్టర్ ఎన్.వసుంధర, ఐసీడీఎస్ పీడీ కె.విజయకుమారి, జిల్లా ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ రాజీవ్, డాక్టర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
3500 మందికి ఉచితంగా కళ్లజోళ్లు
జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా 3,500 మంది విద్యార్థులకు గురువా రం ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో 2024 ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య 18 ఏళ్ల వయసున్న విద్యార్థులకు స్ర్కీనింగ్ చేయడం ద్వారా కంటి సమస్యలు గుర్తించామన్నారు.
పేదరిక నిర్మూలన దిశగా పి-4 సర్వేచేయాలి
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 6( ఆం ధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన, విజన్-2047 అం శాల నేపథ్యంలో మార్గదర్శకాలు ప్రకారం సర్వే నిర్వహించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గురువారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు జూమ్ మీటింగ్‌లో పీ-4 సర్వే పక్రియ, మార్గదర్శకాలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంతి, రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్ కేతన్‌గార్గ్ పాల్గొన్నారు. జిల్లాలో ఎంఎస్‌ఎంఈ సర్వే విద్యుత్ కనెక్షన్స్ ఆధారంగా చేపడతారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఎంఎస్ ఎంఈ యూనిట్స్‌కు 92,960 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని వాటిలో ఇప్పటివరకు 28,229 సర్వే చేశామన్నారు. మిగిలిన సర్వే ఈ నెల 7నుంచి 22 వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి ఎల్.అప్పలకొం డ, డీపీఆర్వో ఐ.కాశయ్య, జిల్లా పరిశ్రమల అధి కారి శ్రీ వణిధర్‌రామన్, సహాయ సంచాలకుడు పి.ప్రదీప్‌కుమార్, డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, డీపీవో వి.శాంతమణి, డీఎల్‌డీవో పి.వీ ణాదేవి, డీఈవో కె.వాసుదేవరావు, డీపీఆర్వో లక్ష్మణాచార్యులు పాల్గొన్నారు.