కన్న తండ్రే కాలయముడై..
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:43 AM
సర్పవరం జంక్షన్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా హోలీ వేడుకల్లో ఆనందోత్సాహాల్లో మునిగి ఉన్నారు. ఇద్దరూ చిన్నారులు కూడా హోలీ పండుగలో తల్లిదండ్రులతో కలిసి పాల్గొనేందుకు వెళ్తున్నామని సంబరపడ్డారు. కానీ ఇదే తమకు ఆఖరి పండుగ అనే విషయం ఆ చిన్నారులకు తెలియదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాలయముడిలా మారి ఇద్ద రిని అతి పాశవికంగా కాళ్లు,చేతులు కట్టేసి నీళ్ల బకెట్టులో ముంచి, ఊపిరి ఆడకుండా చేసి
ఇద్దరు కుమారుల్ని క్రూరంగా చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడిన నాన్న
కుప్పకూలిన తల్లి
సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
హోలీ రోజున కాకినాడలో దారుణం
సర్పవరం జంక్షన్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా హోలీ వేడుకల్లో ఆనందోత్సాహాల్లో మునిగి ఉన్నారు. ఇద్దరూ చిన్నారులు కూడా హోలీ పండుగలో తల్లిదండ్రులతో కలిసి పాల్గొనేందుకు వెళ్తున్నామని సంబరపడ్డారు. కానీ ఇదే తమకు ఆఖరి పండుగ అనే విషయం ఆ చిన్నారులకు తెలియదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాలయముడిలా మారి ఇద్ద రిని అతి పాశవికంగా కాళ్లు,చేతులు కట్టేసి నీళ్ల బకెట్టులో ముంచి, ఊపిరి ఆడకుండా చేసి హ త్య చేశాడు. అనంతరం తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోటీ ప్రపంచంలో తన పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే తన పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోటు రాసి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకెళితే తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి చంద్రకిషోర్ (37) భార్య తనూజాతో కలసి కాకినాడ అర్బన్ 2వ డివిజన్ తోట సుబ్బారావునగర్ రోడ్డు నెంబర్ -2, రామానాయపేట భూదేవి అపార్టుమెంట్‌లో ప్లాట్ నెంబర్ 202లో తొమ్మిదేళ్లుగా నివాసం ఉంటు న్నాడు. కాకినాడ రూరల్ వాకలపూడి ఓఎన్‌జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఇద్దరు సంతానం కాగా, వారిలో పెద్ద కుమారుడు వానపల్లి జోషిల్ (7), రెండో కుమారుడు నిఖిల్ (6)లు లిటిల్ ఉడ్స్ స్కూల్లో ఒకటో తరగతి, ఎల్‌కేజీ చదువుతున్నారు. శుక్రవారం ఉదయం ఓఎన్‌జీసీ కార్యాలయంలో హోలీ వేడుకలు చేసుకునేందుకు భార్య, ఇద్దరు పిల్లలతో కలసి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన 10 నిమిషాలు అయిన తర్వాత కుమారులు ఇద్దరికీ యూనిఫామ్ కుట్టించేందుకు టైలర్ వద్దకు తీసుకువెళుతున్నానని చంద్ర కిషోర్ భార్యకు చెప్పి కుమారుల్ని వెంట తీసుకుని వెళ్లాడు.
పది నిమిషాల్లో వస్తానని చెప్పి...
పది నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్లిన భర్త ఎంతకీ రాకపోవడంతో భర్తకు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో వచ్చేస్తానని భార్యకు చంద్రకిషోర్ బదులిచ్చాడు. ఎంతకీ భర్త ఇద్దరు పిల్లలతో రాకపోవడంతో కంగారు పడి భర్త ఆఫీసులో పని చేస్తున్న రామమూర్తిని ఇంటికి వెళ్లి చూసిరావాలని పంపించింది. అతడు వెళ్లగా ప్లాట్ డోర్లు లోపల నుంచి వేసి ఉండటంతో పలుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా కిటికీ గ్రిల్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూశాడు. చంద్రకిషోర్ బెడ్‌రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకోవడంతో విగతజీవిగా ఉండటాన్ని చూశాడు. పిల్లలు పక్కనే ఉన్న మరో బెడ్‌రూమ్‌లోని అటాచ్డ్ బాత్‌రూమ్‌లో పిల్లల చేతులు, కాళ్లు కట్టి వేసి, తలలను నీటితో నిండిన బకెట్లలో ముంచడంతో చనిపోయి ఉండటాన్ని పరిశీలించి చంద్రకిషోర్ భార్య, పోలీసులకు సమాచారం అందించాడు.
పోటీ ప్రపంచంలో భవిష్యత్తు లేదని...
అయితే చంద్రకిషోర్ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. దీనిని పోలీసులు, భార్య వచ్చి పరిశీలించగా తన పిల్లలకు పోటీ ప్రపంచంలో భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తానూ మరణిస్తున్నట్టు ఆ నోట్‌లో ఉంది. పిల్లల్ని క్రూ రంగా చంపి భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసిన భార్య కుప్పకూలిపోయింది. పిల్లలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని ఇలా ఎందుకు చంపేశావు అంటూ రోధించింది. ఆర్థిక ఇబ్బందులు ఏమీలేవని సొంత ప్లాటు, కారు, ఆస్తులు ఉన్నాయని మృతుడి అన్నయ్య తెలిపారు. సర్పవరం ఎస్‌హెచ్‌వో బి.పెద్దిరాజు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించామని, సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నామన్నారు.